యాప్నగరం

జై లవ కుశ విమర్శకులపై తారక్ అసహనం!

సాధారణంగానే ఎప్పుడూ కూల్‌గా మాట్లాడే తారక్‌లో తాజాగా జరిగిన జై లవ కుశ సక్సెస్ మీట్‌లో ఒకింత అసహనం కనిపించింది.

TNN 25 Sep 2017, 10:46 pm
సాధారణంగానే ఎప్పుడూ కూల్‌గా మాట్లాడే తారక్‌లో తాజాగా జరిగిన జై లవ కుశ సక్సెస్ మీట్‌లో ఒకింత అసహనం కనిపించింది. జై లవ కుశ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో తారక్ మాట్లాడుతూ.. సినిమా సక్సెస్‌సై సంతోషం వ్యక్తంచేశాడు. సినిమా సక్సెస్ అవడంపై సంతోషం వ్యక్తంచేస్తూనే కొంతమంది విమర్శకులు జై లవ కుశ గురించి విమర్శలు చేశారు కానీ దారినపోయే ఆ కొంతమంది దానయ్యలని తాను ఏమీ అనదల్చుకోలేదని అభిప్రాయపడ్డాడు తారక్. 'కొంతమంది' అని తారక్ ఒత్తి పలకడం చూస్తే, ఆ కొంతమంది రాసిన రివ్యూలు తారక్‌ని బాగానే హర్ట్ చేసినట్టున్నాయనిపించింది.
Samayam Telugu jr ntrs comments on critics of jai lava kusa
జై లవ కుశ విమర్శకులపై తారక్ అసహనం!


ఇక ఆ కొంతమంది సంగతి అలా పక్కనపెడితే, తారక్ మాత్రం వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. పైగా ఓవర్సీస్ లోనూ మిలియన్ డాలర్ కలెక్షన్స్ కలిగిన అత్యధిక చిత్రాలున్న అతి తక్కువ మంది హీరోల జాబితాలోనూ తారక్ ముందున్నాడు. తాజాగా రిలీజైన జై లవ కుశ ఆశించిన స్థాయిలోనే కలెక్షన్స్ రాబడుతుండటం తారక్‌కి ఎంతో సంతోషాన్నిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.