యాప్నగరం

జై లవ కుశ 3 రోజుల కలెక్షన్స్

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని దసరా రేసులోకి దూసుకొచ్చిన జై లవ కుశ సినిమా కలెక్షన్స్ విషయంలోనూ...

TNN 24 Sep 2017, 6:41 pm
శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని దసరా రేసులోకి దూసుకొచ్చిన జై లవ కుశ సినిమా కలెక్షన్స్ విషయంలోనూ అంతే స్పీడుతో దూసుకుపోతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చాటుకున్నాడు. గురువారం రిలీజైన ఈ సినిమా శనివారం వరకే ప్రపంచవ్యాప్తంగా రూ. 75 కోట్లు వసూలు చేయగా అందులో రూ.46 కోట్లు షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Samayam Telugu jr ntrs jai lava kusa total collections
జై లవ కుశ 3 రోజుల కలెక్షన్స్


ట్రేడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి జై లవ కుశ సినిమా రాబట్టిన కలెక్షన్స్(షేర్స్) వివరాలిలా వున్నాయి.

నైజాం- రూ.9.43 కోట్లు
సీడెడ్- రూ.6.45 కోట్లు
నెల్లూరు- రూ.1.46 కోట్లు
గుంటూరు -రూ3.88 కోట్లు
కృష్ణా - రూ.2.59 కోట్లు
ఉత్తరాంధ్ర- రూ.3.42 కోట్లు
తూర్పు గోదావరి- రూ. 3.7 కోట్లు
పశ్చిమ గోదావరి- రూ.2.43 కోట్లు

జై లవ కుశ స్పీడ్ ఇలాగే కొనసాగితే, వచ్చే వీకెండ్ లోపే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.