యాప్నగరం

రాజకీయరంగ ప్రవేశంపై స్పందించిన తారక్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన రాజకీయరంగ ప్రవేశంపై స్పందించారు. జై లవ కుశ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న...

TNN 17 Sep 2017, 8:04 pm
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన రాజకీయరంగ ప్రవేశంపై స్పందించారు. జై లవ కుశ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ రాజకీయాల్లోకి వస్తాడా అనే ప్రస్తావన వచ్చింది. దీంతో తన రాజకీయరంగ ప్రవేశానికి సంబంధించిన ప్రశ్నపై తారక్ స్పందిస్తూ.. "రాజకీయాల్లోకి వస్తానా రానా అనే అంశంపై తనకే ఇంకా ఓ క్లారిటీ లేనప్పుడు దానిపై తాను ఎలా స్పందించగలను" అని అన్నాడు.
Samayam Telugu jr ntrs revelations about his political entry
రాజకీయరంగ ప్రవేశంపై స్పందించిన తారక్


''తాను గతంలోనూ ఇదే సమాధానం చెప్పాను. ఇప్పుడు కూడా అదే సమాధానం చెబుతున్నాను. ఏ విషయంపైనైనా స్పందించేటప్పుడు పూర్తి స్పష్టతతో మాట్లాడితేనే బాగుంటుంది అనేది తన ఉద్దేశం'' అని సమాధానం ఇచ్చి అసలు సమాధానం కోసం ఎదురుచూస్తున్న వారిని మళ్లీ సస్పెన్స్‌లోనే పెట్టాడు తారక్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.