యాప్నగరం

14 ఏళ్ల తర్వాత మళ్లీ జోడీ కడుతున్న హీరో, హీరోయిన్

తమిళ స్టార్ హీరో విజయ్, నటి జ్యోతిక 14 ఏళ్ల తర్వాత మరోసారి జోడీ కట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.

TNN 28 Dec 2016, 6:38 am
తమిళ స్టార్ హీరో విజయ్, నటి జ్యోతిక 14 ఏళ్ల తర్వాత మరోసారి జోడీ కట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. అట్లీ డైరెక్షన్‌లో విజయ్ ఓ సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత లేదా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయనే ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం ఈ మూవీ మేకర్స్ జ్యోతికను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. వాళ్లు ఇచ్చిన ఆఫర్ పట్ల ఆనందం వ్యక్తంచేసిన జ్యోతిక వెంటనే ఆ సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపినట్టు సమాచారం.
Samayam Telugu jyotika vijay teaming up after 14 years
14 ఏళ్ల తర్వాత మళ్లీ జోడీ కడుతున్న హీరో, హీరోయిన్


14 ఏళ్ల క్రితం ఈ ఇద్దరు కలిసి నటించిన తిరుమలై మూవీ, విజయ్‌ మాస్ హీరోగా మార్చి తిరుగులేని విజయాన్ని అందించింది. తిరుమలై తర్వాత ఈ జంట కలిసి నటించడం మళ్లీ ఇదే అవుతుంది. ఇదిలావుంటే ఇప్పటికే కాజల్, సమంతలు విజయ్‌తో చెరో రెండేసి సినిమాల్లో నటించారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ చిత్రంలోనూ సమంత, కాజల్ నటించనున్నారనే టాక్ వినబడుతోంది. కాకపోతే సినిమాపై ఓ అధికారిక ప్రకటన వస్తే కానీ వారి పాత్రలు ఏంటనే క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.