యాప్నగరం

హృతిక్ రోషన్‌కి మద్దతుగా నిలిచిన మాజీ భార్య

ఒకవేళ భార్యా, భర్తలు ఇద్దరూ డైవర్స్ తీసుకుని విడిపోవాల్సి వస్తే, ఆ తర్వాత కూడా ఫ్రెండ్లీగానే ఎలా వుండాలో...

TNN 25 Dec 2016, 3:26 am
ఒకవేళ భార్యా, భర్తలు ఇద్దరూ డైవర్స్ తీసుకుని విడిపోవాల్సి వస్తే, ఆ తర్వాత కూడా ఫ్రెండ్లీగానే ఎలా వుండాలో హృతిక్ రోషన్, సుజానే ఖాన్‌లని చూసి నేర్చుకోవాలేమో! 2013లో విడాకులు తీసుకున్న ఈ జంట ఇప్పటికీ తరచూ ఒకరికొకరు మద్దతు పలుకుతూ అండగా నిలుస్తున్నారు. కంగనా రనౌత్ కారణంగా లీగల్ చిక్కుల్లో చిక్కుకున్నప్పుడు హృతిక్ రోషన్‌కి సపోర్ట్ ఇచ్చిన సుజానే ఖాన్ తాజాగా కాబిల్ మూవీ విషయంలోనూ తన సపోర్ట్ తెలియజేశారు.
Samayam Telugu kaabil movie sussanne khan supports hrithik roshan for kaabil success
హృతిక్ రోషన్‌కి మద్దతుగా నిలిచిన మాజీ భార్య


ఓ ఈవెంట్‌లో తమ కంటపడిన సుజానేను, హృతిక్ ప్రధాన పాత్ర పోషిస్తున్న కాబిల్ మూవీపై మీ అభిప్రాయం ఏంటని అడిగింది మీడియా. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన సుజానే ఖాన్... కాబిల్ మూవీ యూనిట్ కి ఆల్ ది వెరీ బెస్ట్ అంటూ శుభాకాంక్షలు చెప్పడంతోపాటు ఈ సినిమా తప్పకుండా బాగా హిట్ అవుతుంది అని ధీమా వ్యక్తంచేశారామె. అంతేకాకుండా తమ వారసులు హ్రిధాన్, హ్రిహాన్‌ల సంతోషం కోసం ఇటీవలే కలిసి డిన్నర్ కూడా చేశారీ మాజీ భార్యాభర్తలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.