యాప్నగరం

మీడియాపై పట్టలేనంత కోపం తెచ్చుకున్న దర్శకుడు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి, ప్రస్తుతం సూపర్ స్టార్ హీరోగా సెట్స్‌పై వున్న కాలా చిత్రానికి....

TNN 9 Sep 2017, 9:52 pm
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి, ప్రస్తుతం సూపర్ స్టార్ హీరోగా సెట్స్‌పై వున్న కాలా చిత్రాలకి దర్శకుడైన పా రంజిత్‌కి మీడియాపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నీట్‌‌లో సీటు సాధించలేకపోయాననే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న అనిత గురించి ప్రస్తావించే ప్రతీసారి మీడియా సంస్థలు ఆమెని దళిత యువతి, దళిత యువతి అని సంభోదిస్తున్నాయని పా రంజిత్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. తమిళులంతా ఏకమై ఓవైపు నీట్‌కి వ్యతిరేకంగా పోరాడుతోంటే.. ఇదే క్రమంలో ప్రాణాలర్పించిన తమిళనాడు యువతి అనితకు మాత్రం కులం రంగు పులిమి తమిళులని కులం పేరుతో విడదీయాలని చూస్తున్నారని మండిపడ్డాడు.
Samayam Telugu kabali director pa ranjith angry on media in anithas suicide issue
మీడియాపై పట్టలేనంత కోపం తెచ్చుకున్న దర్శకుడు


అనిత ఆత్మహత్య నేపథ్యంలో నీట్ నిర్వహణకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు తమిళ సినిమా ఆర్టిస్టులు ఏర్పాటుచేసిన సమవేశంలో మాట్లాడుతూ పా రంజిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మరో దర్శకుడు అమీర్ వెళ్లి పా రంజిత్‌కి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ అతడు మాత్రం శాంతించలేదు. దీంతో అమీర్, పా రంజిత్ మధ్య వాగ్వీవాదం చోటుచేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.