యాప్నగరం

కైకాల సత్యనారాయణ హెల్త్ అప్‌డేట్.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కూతురి వివరణ

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వస్తున్న వార్తలు యావత్ సినీ ప్రేక్షకులను కలవరపెడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై ఆయన కూతురు రమాదేవి స్పందించారు.

Samayam Telugu 23 Nov 2021, 1:37 pm
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వస్తున్న వార్తలు యావత్ సినీ ప్రేక్షకులను కలవరపెడుతున్నాయి. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని పెద్దఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా కైకాల కూతురు శ్రీమతి రమాదేవి స్పందించారు. తన తండ్రి హెల్త్ కండీషన్ ఎలా ఉందో చెబుతూ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని అన్నారు.
Samayam Telugu కైకాల సత్యనారాయణ హెల్త్ అప్‌డేట్
Kaikala Satyanarayana


తన తండ్రి కైకాల సత్యనారాయణ గారి ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతోందని, నాన్న గారు నెమ్మదిగా కోలుకుంటున్నారని, బయట షికారు చేస్తున్న రూమర్స్ నమ్మి ఎవరూ ఆందోళన చెందకూడదని చెప్పారు. వైద్యులు అందిస్తున్న చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తోందని, ఆయన అందరితో మాట్లాడుతున్నారని చెప్పారు. తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని రమాదేవి తెలిపారు.
మ్యారేజ్ తర్వాత హీరోయిన్ల తీరు! సమంత పెళ్లి మ్యాటర్ తీస్తూ నిహారిక ఓపెన్ కామెంట్స్
గత శుక్ర‌వారం ఉద‌యం అనారోగ్యంతో హైద‌రాబాద్‌లోని అపోలో హాస్పిట‌ల్లో జాయిన్ అయ్యారు కైకాల సత్యనారాయణ. డాక్ట‌ర్స్ బృందం స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్యంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టి ఐసీయూలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. రీసెంట్‌గా కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై రియాక్ట్ అయిన చిరంజీవి.. కైకాల స‌త్య‌నారాయ‌ణ‌ గారు స్పృహ‌లోకి వ‌చ్చార‌ని చెప్పారు. కైకాల గారు సంపూర్ణ ఆయురారోగ్యాల‌తో తిరిగి రావాల‌ని ప్రార్థిస్తూ ఆయ‌న అభిమానులు, శ్రేయోభిలాషులంద‌రితో ఈ విష‌యం పంచుకోవ‌డం సంతోషంగా ఉందని అన్నారు. మరోవైపు కైకాల హెల్త్ త్వరగా కుదుటపడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.