యాప్నగరం

తాను రేటు పెంచలేదన్న కాజల్ అగర్వాల్

బిజినెస్‌మేన్ సినిమా తర్వాత పారితోషికం రెట్టింపు చేసి ఆఫర్లు దూరమయ్యేలా చేసుకుంది అనే పేరు సంపాదించుకున్న...

TNN 24 Aug 2017, 8:02 pm
బిజినెస్‌మేన్ సినిమా తర్వాత పారితోషికం రెట్టింపు చేసి ఆఫర్లు దూరమయ్యేలా చేసుకుంది అనే పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ఈమధ్య కాలంలో మళ్లీ వరుసగా సినిమాలు సైన్ చేసి ఆ చెడ్డ పేరుని పోగొట్టుకుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో చేసిన సినిమాల్లో మంచి పర్‌ఫార్మెన్స్‌ని కనబర్చి మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది కూడా. ఇక కాజల్ అగర్వాల్ సక్సెస్ ట్రాక్‌లో పడింది కదా అని అనుకుంటున్న ప్రస్తుత తరుణంలో మరోసారి ఆమె తన పారితోషికం పెంచిందనే పుకార్లు షికార్లు చేశాయి.
Samayam Telugu kajal aggarwal denies hiking remuneration
తాను రేటు పెంచలేదన్న కాజల్ అగర్వాల్


ఇదిలావుంటే, తనపై వస్తున్న ఈ కామెంట్స్‌పై స్పందించిన కాజల్.. అవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే అని కొట్టిపారేసింది. తాను చేసే పనికి తగిన పారితోషికం లభిస్తోంది. అంతకుమించి నిర్మాతలకి భారంగా మారే పని ఏదీ తాను చేయను అని స్పష్టంచేసింది కాజల్ అగర్వాల్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.