యాప్నగరం

తండ్రి కాబోతున్న సమయంలో నీ తీరు! భర్త గౌతమ్‌పై కాజల్ ఎమోషనల్ కామెంట్స్

తాజాగా తన భర్త గౌతమ్ కిచ్లుపై కామెంట్స్ చేస్తూ కాజల్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రెగ్నెన్సీ సమయంలో తనను గౌతమ్ ఎలా చూసుకుంటున్నాడనేది వివరంగా చెప్పింది కాజల్ అగర్వాల్.

Samayam Telugu 14 Apr 2022, 1:08 pm

ప్రధానాంశాలు:

  • ప్రెగ్నెన్సీ టైమ్ ఎంజాయ్ చేస్తున్న కాజల్
  • భర్త తీరును వివరిస్తూ సుదీర్ఘ పోస్ట్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu భర్త గౌతమ్‌పై కాజల్ ఎమోషనల్ కామెంట్స్
Kajal- Gautham
టాలీవుడ్ చందమామ, స్టార్ హీరోయిన్ కాజల్ తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది కాజల్. ఈ క్రమంలోనే తాజాగా తన భర్త గౌతమ్ కిచ్లుపై కామెంట్స్ చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రెగ్నెన్సీ సమయంలో తనను గౌతమ్ ఎలా చూసుకుంటున్నాడనేది వివరంగా చెప్పింది కాజల్ అగర్వాల్.
''ప్రతి అమ్మాయి కోరుకునేలా ఉన్న గొప్ప భర్తకి, కాబోయే నాన్నకు చాలా థ్యాంక్స్. గర్భం దాల్చినప్పటి నుంచి నన్ను అనుక్షణం ఎంతో కేరింగ్‌గా చూసుకుంటున్నారు. నాతో పాటు ప్రతి రాత్రి మెలకువగా ఉంటూ నన్ను జాగ్రత్తగా చూసుకున్నావు. ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహాలు తీసుకుంటూ నా ఆరోగ్యంపై శ్రద్ధ వహించావు. ప్రోటీన్స్ ఉన్న మంచి ఫుడ్ పెట్టడం దగ్గర నుంచి ప్రతి టైమ్‌లో నేను బ్యాడ్‌గా ఫీల్ కాకుండా నువ్వు చూపించిన ప్రేమ.. మీరు మీ బిడ్డకు గొప్ప తండ్రి అవుతారని స్పష్టం చేస్తున్నాయి.
ఆ కొలత చెప్పమంటూ నెటిజన్ వింత ప్రశ్న.. శృతి హాసన్ దిమ్మతిరిగే రిప్లై
గత 8 నెలల్లో, మీరు అత్యంత ప్రేమ గల నాన్నగా మారడం నేను చూశాను. మనకు పుట్టబోయే పాపను మీరు ఎంత పేమిస్తున్నారో, ఎంత శ్రద్ధ వహిస్తున్నారో నాకు తెలుసు. మన బేబీ తనను అమితంగా ఇష్టపడే తండ్రిని, అలాగే రోల్ మోడల్‌ని చూస్తోంది. ఇది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. మన జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. నిద్రలేని రాత్రులు, సిగ్గుగా ఫీల్ అయిన సందర్భాలున్నాయి. అవన్నీ తీపి జ్ఞాపకాలు. చాలా విషయాల్లో మార్పులొచ్చాయి కానీ నాకు నీపై ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది'' అంటూ ఎమోషనల్ లెటర్ పోస్ట్ చేసింది కాజల్.
View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

గౌతమ్‌లో పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించిన కాజల్.. మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆచార్య' మూవీ చేసింది. ఈ సినిమాలో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. తన డెలివరీ మే నెలలో ఉంటుందని పోస్టుల ద్వారా హింట్స్ ఇస్తూ వస్తోంది కాజల్ అగర్వాల్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.