యాప్నగరం

నేను నిజంగానే 'పక్కా లోకల్' అంటున్న కాజల్

'నేను పక్కా లోకల్.. పక్కా లోకల్ నేను పక్కా లోకలూ'... అంటూ జనతా గ్యారేజ్ సినిమాలో కుర్రకారుని హుషారెత్తించిన కాజల్...

TNN 25 Mar 2017, 11:23 pm
'నేను పక్కా లోకల్.. పక్కా లోకల్ నేను పక్కా లోకలూ'... అంటూ జనతా గ్యారేజ్ సినిమాలో కుర్రకారుని హుషారెత్తించిన కాజల్ అగర్వాల్ ఆ సాంగ్‌ని తాను ఇష్టపూర్తిగానే చేసినట్టు అంగీకరిస్తోంది. ఆ సాంగ్‌ని తాను ఎంతో ఎంజాయ్ చేశానంటున్న ఈ నాన్ లోకల్ బ్యూటీ... ఐటం సాంగ్స్ పట్ల జనంలో వున్న దురభిప్రాయాన్ని, నమ్మకాలని పారదోలాలని భావిస్తున్నట్టు పేర్కొంది కాజల్. అంతేకాకుండా అవకాశం వస్తే, మరిన్ని ఐటంసాంగ్స్ చేయడానికి కూడా తాను రెడీగా వున్నానని ఫిలింమేకర్స్‌కి కూడా ఇండైరెక్టుగానే హింట్ ఇచ్చేసిందీ లేడీ.
Samayam Telugu kajal aggarwal wants to do more item songs
నేను నిజంగానే 'పక్కా లోకల్' అంటున్న కాజల్


ప్రస్తుతం తేజ తెరకెక్కిస్తున్న 'నేనే రాజు నేనే మంత్రి' మూవీతోపాటు మరో రెండు తమిళ సినిమాలు కాజల్ చేతిలో వున్నాయి. ఈ మూడు సినిమాల సంగతెలా వున్నా... ఐటం సాంగ్స్ పట్ల కాజల్ పెద్ద మనసు తెలిసిన ఫిలింమేకర్స్ ఎవరైనా ఆమెకి త్వరలోనే మరో ఐటం నెంబర్ ఆఫర్ చేసే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే కాస్తా బడ్జెట్టే ఆలోచించాల్సిన విషయమేమో!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.