యాప్నగరం

అబ్బాయ్ తర్వాత బాబాయ్‌తో కాజల్ రొమాన్స్!

ముందుగా యంగ్ హీరోలతో నటించడం ఆపై వెటరన్స్ తో జతకట్టడం.. కాజల్ కు ఇది కొత్తేం కాదు

TNN 6 Nov 2017, 9:37 am
ముందుగా యంగ్ హీరోలతో నటించడం ఆపై వెటరన్స్ తో జతకట్టడం.. కాజల్ కు ఇది కొత్తేం కాదు. ఇది వరకూ రామ్ చరణ్ తేజ సరసన కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కాజల్ ఆపై చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవితో జతకట్టింది. చరణ్ తో ‘మగధీర’ ‘నాయక్’ వంటి హిట్ సినిమాల్లో నటించిన కాజల్ చిరుతో జతకట్టి ‘ఖైదీ 150’తో సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.
Samayam Telugu kajal set to romance venky after rana
అబ్బాయ్ తర్వాత బాబాయ్‌తో కాజల్ రొమాన్స్!


ఈ నేపథ్యంలో కాజల్ కు అవకాశాలు బాగానే ఉన్నాయి. ఆ పరంపరలోనే ఇటీవల ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో ఈమె హిట్టు కొట్టింది. అందులో రానా సరసన హీరోయిన్ గా నటించింది కాజల్. తేజ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా హిట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ భామకు మరో అవకాశం వరించినట్టు సమాచారం. తేజ దర్శకత్వంలోనే వెంకటేష్ హీరోగా రానున్న సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించనున్నదని తెలుస్తోంది.

ఈ విధంగా ముందుగా అబ్బాయ్ రానా సరసన హీరోయిన్ గా నటించిన కాజల్ ఇప్పుడు బాబాయ్ వెంకటేష్ సరసన నటిస్తోంది. తండ్రీ కొడుకులతో నటించే పరంపరను కొనసాగిస్తోంది. అలాగే తేజ దర్శకత్వంలో కాజల్ కు ఇది మూడో సినిమా అవుతుంది. తేజ డైరెక్షన్లో వచ్చిన ‘లక్ష్మీకల్యాణం’ సినిమాతో కెరీర్ ను ఆరంభించిన కాజల్ ఇప్పుడు ఆ దర్శకుడితో వరసగా సినిమాలు చేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.