యాప్నగరం

ఈ గబ్బర్ సింగ్ ‘పవన్ ఫ్యాన్’ అట!

మెగాబ్రదర్‌ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది 'కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌' మూవీ.

TNN 10 May 2017, 9:06 pm
మెగాబ్రదర్‌ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది 'కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌' మూవీ. శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్‌ అండ్‌ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్‌ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నూతన నటీనటులు కళ్యాణ్‌, లక్ష్మీశిల్పలు హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో మెగా బ్రదర్‌ నాగబాబు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
Samayam Telugu kalyan fan of pawan movie launch
ఈ గబ్బర్ సింగ్ ‘పవన్ ఫ్యాన్’ అట!


అనంతరం నటి కవిత తొలి సన్నివేశానికి క్లాప్‌ నివ్వగా నిర్మాత సాయివెంకట్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ప్రముఖ దర్శకులు సాగర్‌ ఈ చిత్రం తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర నిర్మాత టి. రామకృష్ణ మాట్లాడుతూ.. చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన అతిధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

జూన్‌ మొదటివారం నుండి చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతోందని విశాఖపట్నం, అరకు, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో మొదటి షెడ్యుల్‌ షూటింగ్‌ని ప్లాన్‌ చేశామని వీలైనంత త్వరలోనే షూటింగ్ ముగించి గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామన్నారు చిత్ర యూనిట్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.