యాప్నగరం

సీనియర్ ఎన్టీఆర్‌గా కళ్యాణ్‌రామ్ కొడుకు!

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ తేజ కాంబినేషన్‌లో నటరత్న నందమూరి తారకరామారావు జీవిత కథను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.

TNN 9 Jan 2018, 11:56 am
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ తేజ కాంబినేషన్‌లో నటరత్న నందమూరి తారకరామారావు జీవిత కథను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. వివాదాల జోలికి పోకుండా కథను సాఫీగా నడిపించి ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు తేజ ప్రయత్నిస్తున్నారు. పాత్రల ఎంపిక విషయంలో తేజ తర్జనభర్జన పడుతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరోవైపు ఈ సినిమా టీజర్ కోసం షూటింగ్ కూడా జరుపుతున్నారట.
Samayam Telugu kalyan rams son shourya ram to play sr ntrs childhood role
సీనియర్ ఎన్టీఆర్‌గా కళ్యాణ్‌రామ్ కొడుకు!


ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాపై మరోవార్త టాలీవుడ్‌లో వినిపిస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ బాల్యానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పనున్నారట. చిన్నప్పటి ఎన్టీఆర్ పాత్ర కోసం ఆయన ముని మనవడు, కళ్యాణ్‌రామ్ తనయుడు శౌర్యరామ్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

టీజర్ కోసం శౌర్యరామ్‌తో కొన్ని సన్నివేశాలను కూడా తేజ షూట్ చేశారని అంటున్నారు. కాగా, శౌర్యరామ్ వెండితెరపై కనిపించడం ఇది తొలిసారి కాదు. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇజం’ సినిమాలో చిన్నప్పటి కళ్యాణ్‌రామ్ పాత్రను శౌర్య పోషించాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బయోపిక్ టీజర్‌ను ఆయన వర్థంతి సందర్భంగా జనవరి 18న విడుదల చేయనున్నట్లు సమాచారం. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.