యాప్నగరం

కమల్ పాలి‘ట్రిక్స్’: నేనూ రాజకీయాల్లోకి వస్తున్నా ఎప్పుడంటే..

తమిళ రాజకీయాలు అంతకంతకూ రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు తమిళ తలైవా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించి పెను సంచలనంగా మారారు. పార్టీని ఇంకా ప్రకటించక ముందే ఆయనతో కలిసి నడిచేందుకు ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు.

TNN 4 Jan 2018, 10:53 pm
తమిళ రాజకీయాలు అంతకంతకూ రసవత్తరంగా మారుతున్నాయి. అమ్మ మరణంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు తమిళ తలైవా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించి పెను సంచలనంగా మారారు. పార్టీని ఇంకా ప్రకటించక ముందే ఆయనతో కలిసి నడిచేందుకు ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు.
Samayam Telugu kamal haasan political entry soon
కమల్ పాలి‘ట్రిక్స్’: నేనూ రాజకీయాల్లోకి వస్తున్నా ఎప్పుడంటే..


ఇదిలాఉంటే ఎప్పటి నుండో రజనీకాంత్‌తో పాటు పొలిటికల్ ఎంట్రీకి సరైన ముహూర్తం కోసం ఎదురు చూస్తున్న లోకనాయకుడు కమల్ హాసన్ కూడా తానూ రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందని స‍్పష‍్టం చేశారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని ఆ రెండు పెద్ద ప్రాజెక్ట్‌లు కావడంతో ఆ సినిమాలను పూర్తి చేసిన వెంటనే రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు నటుడు కమల్‌హాసన్‌ తెలిపారు.

తాను గతంలో ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నానని.. అయితే తాను సినిమాలను వదిలేయడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు ఆవేదన చెందుతున్నారన్నారు. తమిళ వారపత్రికకు కమల్‌ రాస్తున్న ధారావాహిక శీర్షికలో ఈ విషయాలను ప్రస్తావించారు కమల్.

అయితే కమల్ హాసన్ సొంతంగా పార్టీ పెడతారా లేక రజనీకాంత్‌తో కలిసి నడుస్తారా అన్నది తేలాల్సిఉంది. ఇటీవల రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై కమల్ హాసన్ స్పందిస్తూ.. రజనీ రాజకీయ ప్రవేశాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా నా సోదరుడు రజనీకి శుభాకాంక్షలు తెలుపుతున్నానని కమల్ హాసన్‌ శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.