యాప్నగరం

‘మరుదనాయగం’పై కమల్ సంచలన నిర్ణయం

కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'మరుదనాయగం'ని 1997వ సంవత్సరంలో బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజిబెత్ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించాడు. కానీ..

TNN 29 Jun 2017, 2:03 pm
కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'మరుదనాయగం'ని 1997వ సంవత్సరంలో బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజిబెత్ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించాడు. కానీ ఆర్థిక సమస్యల కారణంగా ఆ సినిమా ముందుకు సాగడం లేదు. ఎన్నోసార్లు ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని అనుకున్నప్పటికీ ఆలస్యమవుతూనే ఉంది. దీంతో ఇక ఈ సినిమా అటకెక్కినట్లేనని అందరూ భావించారు.
Samayam Telugu kamal haasans marudhanayagam in web series
‘మరుదనాయగం’పై కమల్ సంచలన నిర్ణయం


అయితే ఇటీవల కమల్ ఈ విషయంపై స్పందిస్తూ.. 'మరుదనాయగం' సినిమాగానే కాకుండా.. వెబ్ సిరీస్, టీవీ సిరీస్ మాదిరి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వెల్లడించారు. దీంతో ఇక ఈ ప్రాజెక్ట్ సినిమాగా రావడం కష్టమేనని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇన్ని వార్తల నడుమ ఇప్పుడు ఈ సినిమాను తిరిగి ప్రారంభించనున్నట్లు ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు కమల్.

ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమాను వెబ్ సిరీస్, టీవీ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారు కమల్ హాసన్. ప్రస్తుతం ఆయన తమిళంలో బిగ్ బాస్ షోతో బిజీగా గడుపుతున్నారు. అలానే మరికొద్ది రోజుల్లో 'శభాష్ నాయుడు' సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టాలని చూస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.