యాప్నగరం

కమ్మ లాబీయింగ్ వల్లే నంది వివాదం: నల్లమలపు బుజ్జి

కమ్మలాబీయింగ్ వల్లే నంది అవార్డుల వివాదం చెలరేగుతోందని రేసుగుర్రం చిత్ర నిర్మాత నల్లమలపు బుజ్జి తీవ్ర ఆరోపణలు చేశారు.

TNN 16 Nov 2017, 10:10 pm
ఏపీ ప్రభుత్వం ఏ క్షణాన నంది అవార్డులను ప్రకటించిందో కానీ.. ఆ వివాదం రోజు రోజుకూ ముదిరి పాకన పడుతోంది. మా సినిమాలకు ఎందుకు అవార్డులు ఇవ్వలేదనే అసంతృప్తులు బయటకు వస్తున్నాయి. రుద్రమదేవి సినిమాకు నంది ప్రకటించకపోవడం పట్ల గుణశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రేసుగుర్రం నిర్మాత నల్లమలపు బుజ్జి మరో అడుగు ముందుకేసి కమ్మ లాబీయింగ్ వల్లే ఇలా జరిగిందని విమర్శించారు. 2002 నుంచి చిరంజీవి ఫ్యామిలీకి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. మనం సినిమా ‘కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యావ్‌గా’ పాటకు 8 అవార్డులొచ్చాయి. రుద్రమ దేవి సినిమా ఓ చరిత్ర. దానికి కూడా ఇవ్వలేదు. సంతకం పెట్టడం తప్పితే జ్యూరీ వాళ్లేం చేయరని బుజ్జి ఆరోపణలు చేశారు. రామారావు మహానుభావుడు కాబట్టే గతంలో తన కొడుకు అనే పక్షపాతం చూపలేదని తెలిపారు.
Samayam Telugu kamma lobbying in nandi awards announcement nallamalupu bujji
కమ్మ లాబీయింగ్ వల్లే నంది వివాదం: నల్లమలపు బుజ్జి


దీనికి నల్లమలపు బుజ్జి స్పందిస్తూ.. మనం సినిమా.. అక్కినేని నాగేశ్వరరావు చనిపోతూ నటించిన సినిమా. ఆత్మలు, పునర్జన్మ సినిమాలకు ఎందుకు ఇవ్వరు. గతంలో ఇవ్వలేదా? కంచె మూవీకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కల్యాణ్ నువ్వు దాసరి నారాయణ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నావో తెలుసు కదా? అవార్డులను ఇవ్వడానికి కమర్షియల్ సినిమాలు ప్రాతిపాదిక కాదు అంటున్నారు కదా. లెజెండ్ సినిమాను 9 అవార్డులు ఇచ్చారు. దాన్ని ఏ కెటగిరీలోకి తీసుకుంటారని ప్రశ్నించారు.

మరో నిర్మాత సి. కల్యాణ్ నల్లమలపు బుజ్జి విమర్శలను తిప్పి కొట్టారు. టీవీ చర్చల్లో కూర్చున్న వాళ్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అవార్డు సినిమా అంటే ఏంటో తెలుసుకోవాలి. సినిమా సమాజానికి ఉపయోగపడాలి. చరిత్ర తెలుసుకోవాలి. గుణశేఖర్ సినిమాకు ఎందుకు ఇవ్వలేదని అడగండి. చిరు కెరీర్లో ఎప్పుడూ అవార్డులను ఆశించలేదు. అవార్డుల ఎంపికలో కుల లాబీయింగ్ లేదు. అంతా సినిమా కులమే. అవసరం ఉంటేనే కులాల డ్రామా. నేను 69 సినిమాలు చేశాను. నాకు చందమామ ఒక్కటి చాలు. రేసు గుర్రం సినిమాలో నీ బుర్ర పని చేయలేదు. సినిమా ఇండస్ట్రీని రోడ్డు మీద పడేయటానికి నువ్వు వచ్చావ్ అంటూ బుజ్జిపై మండి పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.