యాప్నగరం

Kangana Ranaut: మళ్ళీ మొదలెట్టిన కంగనా.. మీ ఆశీర్వాదాలు కావాలంటూ మ్యటర్ చెప్పేసింది

ఇన్నిరోజులు పలు వివాదాలతో రచ్చ చేసిన కంగనా రనౌత్.. తిరిగి తన సినిమా షూటింగ్స్‌తో బిజీ కాబోతోంది. ఈ మేరకు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ ఫైర్ బ్రాండ్.

Samayam Telugu 1 Oct 2020, 6:01 pm
లాక్‌డౌన్ వేళ పలు వివాదాల్లో తలదూర్చి సంచలన కామెంట్స్ చేసిన కంగనా రనౌత్.. ఇక సినిమా షూటింగులతో బిజీ అవుతోంది. కరోనా కారణంగా గత ఆరు నెలలకు పైగా కెమెరాకు దూరంగా ఉన్న ఈ ఫైర్ బ్రాండ్ తిరిగి ఈ రోజే (అక్టోబర్ 1) సెట్స్ పైకి వచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది కంగనా. ఈ మేరకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలని ఆమె కోరడం విశేషం.
Samayam Telugu మళ్ళీ మొదలెట్టిన కంగనా.. మీ ఆశీర్వాదాలు కావాలంటూ మ్యటర్ చెప్పేసింది
Kangana Ranaut


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న `తలైవి` సినిమాలో కంగన లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా గత కొన్నినెలలుగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ తిరిగి ఈ రోజే ప్రారంభమైంది. దీంతో ఇందులో పాల్గొనడం పట్ల తన ఫీలింగ్స్ తెలుపుతూ పోస్ట్ పెట్టిన కంగనా.. ''ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. దాదాపు ఏడు నెలల తర్వాత సెట్స్ మీదకు వస్తున్నా. ఎంతో ఆసక్తికరమైన `తలైవి` సినిమా కోసం దక్షిణాదికి పయనమవుతున్నా. ఈ విపత్కర పరిస్థితుల్లో మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నా'' అంటూ ట్వీట్ చేసింది. ఈ మేరకు నేటి ఉదయం తీసుకున్న ఫ్రెష్ సెల్ఫీ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

Also Read: Anushka: ఇన్ని పుకార్లా? నమ్మొద్దు బాబోయ్.. అదే నిజమైతే నేనే మీ అందరికీ చెబుతాగా!

ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ 'తలైవి' చిత్రంలో ఇతర రాజకీయ నాయకులకు జయలలిత ఇచ్చిన కౌంటర్స్ యధావిధిగా చూపించనున్నారని టాక్. అదేవిధంగా జయలలిత జీవితంలో ఎత్తుపల్లాలు, వివాదాలు అన్నీ కళ్ళకు కట్టినట్లు ఇందులో చూపించనున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. చివరి దశ షూటింగ్ కంప్లీట్ చేస్తున్న చిత్రయూనిట్ అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.