యాప్నగరం

బాలీవుడ్ ‘క్వీన్’ బర్త్ డే గిఫ్ట్ ఏంటో తెలుసా?

బాలీవుడ్ సహజనటి కంగనా రనౌత్... అందరి హీరోయిన్ల కన్నా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది.

TNN 24 Mar 2017, 3:45 pm
బాలీవుడ్ సహజనటి కంగనా రనౌత్... అందరి హీరోయిన్ల కన్నా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. బోల్డ్ గా నటించడమే కాదు, బోల్డ్ గా మాట్లాడుతుంది కూడా. తన వ్యక్తిగత విషయాలు మీడియాతోనూ, అభిమానులతోనూ తరచూ పంచుకుంటుంది. రాజకుటుంబంలో పుట్టి బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఎదిగేందుకు ఆమె చాలా కష్టపడింది. తాజాగా తన 30వ పుట్టినరోజును చేసుకుంది ఈ క్వీన్. మార్చి 23న ఆమె పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంది. ఆ రోజున తనకు తానే భారీ గిఫ్ట్ ఇచ్చుకుంది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా? మూడంతస్థుల భవనం.
Samayam Telugu kangana ranaut gifts herself a three storeyed bungalow on her birthday
బాలీవుడ్ ‘క్వీన్’ బర్త్ డే గిఫ్ట్ ఏంటో తెలుసా?


తాను ప్రస్తుతం ముంబైలోని ఖర్ ప్రాంతంలో నివసిస్తోంది. అక్కడికి దగ్గర్లోనే మూడు అంతస్థుల భవనాన్ని కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆ ఇంటికి చాలా అందమైన ఇంటీరియర్ పనులు చేయించే పనిలో ఉంది కంగనా. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ షబ్నం గుప్తాకు ఆ పనులు అప్పగించింది. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో మరో ఇంటికి శంకుస్థాపన చేసిందట. ఒకేసారి రెండు ఇళ్లకు ఓనరైపోయింది కంగనా. త్వరలో కంగనా ఝాన్సీరాణి లక్ష్మీబాయ్ జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్న మణికర్ణిక సినిమాలో చేస్తోందట. ఆ సినిమాకు మన క్రిష్ దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.