యాప్నగరం

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. హీరో సంచారి విజయ్ కన్నుమూత

కొద్ది సేపటి క్రితం కన్నడ నటుడు సంచారి విజయ్‌ కన్నుమూశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

Samayam Telugu 14 Jun 2021, 1:45 pm
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్ ఇలా అన్ని చోట్లా చోటు చేసుకుంటున్న వరుస మరణాలు సినీ వర్గాలను విషాదంలో ముంచెత్తుతున్నాయి. ఒకరి మరణం తాలూకు విషాదం నుంచి బయటకు రాకముందే మరొకరి మరణ వార్త బయటకొస్తోంది. కొద్ది సేపటి క్రితం కన్నడ నటుడు సంచారి విజయ్‌ కన్నుమూశారు.
Samayam Telugu నటుడు సంచారి విజయ్ కన్నుమూత
Sanchari Vijay


ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సంచారి విజయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరులోని ఓ స్నేహితుడి ఇంటి నుంచి సొంతింటికి బైక్‌ మీద వెళుతుండగా ఆయనకు యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ఘటనలో విజయ్‌ తల, కాలికి బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను వెంటనే దగ్గరలోకి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారి తుది శ్వాస విడిచారు.
Upasana: చీర్స్ అంటూ మెగా కోడలి పోస్ట్.. ప్రత్యేకమైన రోజున రామ్ చరణ్‌తో అలా! ఉపాసన కామెంట్స్ వైరల్
2011 సంవత్సరంలో వచ్చిన 'రంగప్ప హోగ్‌బిట్న' మూవీతో సినీ గడపతొక్కిన సంచారి విజయ్.. ఆ తర్వాత 'హరివూ', 'ఒగ్గరానే' సినిమాలతో మంచి గుర్తింపు పొందారు. ‘నాను అవనాల్ల.. అవలు’ చిత్రంలో ట్రాన్స్‌జెండర్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆయన జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. చివరగా 'యాక్ట్‌ 1978' చిత్రంలో ఆయన కనిపించారు. సంచారి విజయ్‌ మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.