యాప్నగరం

సామ్-చైతూ మాదిరే రెండుసార్లు పెళ్లిచేసుకున్న మరో సినీ జంట

మరో రీల్ లైఫ్ ప్రేమజంట రియల్ లైఫ్‌లో భార్యాభర్తలు అయ్యారు. సుమారు పదేళ్ల ప్రేమబంధాన్ని పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంగా మలుచుకున్నారు.

Samayam Telugu 2 May 2018, 4:59 pm
మరో రీల్ లైఫ్ ప్రేమజంట రియల్ లైఫ్‌లో భార్యాభర్తలు అయ్యారు. సుమారు పదేళ్ల ప్రేమబంధాన్ని పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంగా మలుచుకున్నారు. తాజాగా టాలీవుడ్‌లో సమంత- నాగచైతన్యలు హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్దతుల్లో ఇటీవల వివాహం చేసుకోగా.. శాండిల్‌వుడ్‌కి చెందిన మరో బ్యూటిఫుల్ లవ్ కపుల్స్ చిరంజీవి సర్జా- మేఘనా రాజ్‌లు ఆదివారం నాడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కన్నడ మూవీ ‘ఆటగార’లో జోడీకట్టిన చిరంజీవి సర్జా, మేఘనా రాజ్ జంట రియల్ లైఫ్ పార్టనర్స్‌గా కొత్తజీవితాన్ని ప్రారంభించారు.
Samayam Telugu చిరంజీవి సర్జా, మేఘనా రాజ్

సుమారు పది సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2017 అక్టోబర్ 22న ఘనంగా నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. అనంతరం రెండు కుటుంబాల పెళ్లి సాంప్రదాయాలు వేరు కావడంతో ఇరువురి అంగీకారంతో హిందూ, క్రిస్టియన్ మత సాంప్రదాయాల్లో వీరి వివాహం జరిపించడానికి పెద్దలు నిశ్చయించారు. తాజాగా ఆదివారం నాడు బెంగుళూరులో వీరి వివాహం క్రిస్టియన్ పద్దతిలో వైభవంగా జరిగింది. అనంతరం హిందూ సాంప్రదాయ పద్దతిలో నేడు (మే 2న) బెంగుళూరులోని ప్యాలెస్‌ గ్రౌండ్‌లో వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు హాజరయ్యారు.

చిరంజీవి సర్జా, మేఘనా రాజ్ కుటుంబ నేపథ్యం:
చిరంజీవి సర్జా, మేఘనా రాజ్ ఇద్దరూ సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాలనుండి వచ్చినవారే. చిరంజీవి సర్జా.. ప్రముఖ నటుడు, దర్శకుడు అర్జున్ సర్జా మేనల్లుడు కాగా.. మేఘనా రాజ్ సుందర్ రాజ్, ప్రమీలా జో సాయి దంపతుల కుమార్తె.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.