యాప్నగరం

సీనియర్ నటుడు కాశీనాథ్ కన్నుమూత

కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు కాశీనాథ్ గురువారం కన్నుమూశారు.

TNN 18 Jan 2018, 12:11 pm
న్నడ సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత కాశీనాథ్ గురువారం ఉదయం కన్నుమూశారు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న కాశీనాథ్ రెండు రోజుల కిందట తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బెంగళూరులోని శంకర కేన్సర్ ఆసుపత్రిలో చేర్చారు. 40 పైగా సినిమాల్లో నటించిన కాశీనాథ్, 13 చిత్రాలను స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించారు. కొన్ని చిత్రాలకు సంగీత దర్శకుడిగానూ పనిచేశారు. కాశీనాథ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు అభిమన్యు ప్రస్తుతం కన్నడ సినిమాల్లో నటిస్తున్నారు.
Samayam Telugu kannada film actor kashinath passes away
సీనియర్ నటుడు కాశీనాథ్ కన్నుమూత


కాశీనాథ్ తెలుగు చిత్రసీమకు సుపరిచితులే. ద్వంద అర్థాల డైలాగులతో తీసిన ‘పెద్దల’ సినిమాలతో కాశీనాథ్ ఫేమస్ అయ్యారు. కాశీనాథ్ చివరగా ‘చౌక’ సినిమాలో నటించారు. ప్రముఖ కన్నడ నటులు ఉపేంద్ర, వి.మనోహర్ తదితరులను ఆయన సినీ రంగానికి పరిచయం చేశారు. ఆయన నటించిన.. అనుభవం, వింత శోభనం, పొగరుబోతు పెళ్లం, సుందరాంగుడు, భూలోకంలో రంభ ఊర్వశీ మేనక వంటి అడల్డ్ కామెడీ సినిమాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. కాశీనాథ్ మరణానికి కన్నడ చిత్రసీమ సంతాపం ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.