యాప్నగరం

హాస్పిటల్‌లో చేరిన నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్.. కరోనా సోకిందా?

నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్‌కు కరోనా సోకిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆయన హాస్పిటల్‌లో చేరారనే విషయం బయటికి రావడంతో హాట్ టాపిక్‌గా మారింది.

Samayam Telugu 8 Jul 2020, 8:43 pm
ప్రముఖ నిర్మాత, నటుడు రాక్‌లైన్ వెంకటేష్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. వెంకటేష్ కుమారుడు డాక్టర్ అభిలాష్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తన తండ్రి ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. వెంకటేష్‌కు కరోనా సోకిందని ప్రస్తుతం కన్నడ నాట ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెంకటేష్ హాస్పిటల్‌లో చేరడం హాట్ టాపిక్‌గా మారింది.
Samayam Telugu రాక్‌లైన్ వెంకటేష్
Rockline Venkatesh


దివంగత నటుడు అంబరీశ్ స్మారకం నిర్మాణం గురించి మాట్లాడేందుకు ఆయన భార్య, ఎంపీ సుమలత, రాక్‌లైన్ వెంకటేష్ కలిసి జూన్ ఆఖరి వారంలో ముఖ్యమంత్రి యడ్యూరప్పను కలిశారు. అయితే, తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు సోమవారం సుమలత ప్రకటించారు. ఈ మధ్య కాలంలో తనను కలిసినవారు కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆమె సూచించారు. దీంతో ఈ మధ్య సుమలతను వెంకటేష్ కలిశారు కాబట్టి ఆయనకు కరోనా వచ్చి ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది. కానీ, ఆయనకు కరోనా టెస్ట్ చేశారా లేదా అనే విషయంలో ఇంకా డాక్టర్లు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Also Read: మరో యువ నటుడు ఆత్మహత్య.. ఇది పరిష్కారం కాదన్న హీరో

భారీ చిత్రాల నిర్మాతగా రాక్‌లైన్ వెంకటేష్‌కు మంచి పేరుంది. ఎన్నో సూపర్ హిట్ తెలుగు చిత్రాలను ఆయన కన్నడలో రీమేక్ చేశారు. తెలుగులో రవితేజతో ‘పవర్’ సినిమా నిర్మించారు. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘బజరంగీ భాయీజాన్’‌కు ఆయన సహ నిర్మాత. రజినీకాంత్ ‘లింగా’ సినిమాను ఈయనే నిర్మించారు. నటుడిగానూ పలు చిత్రాల్లో వెంకటేష్ నటించారు. రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’లో వెంకటేష్ మైసూర్ ఎస్పీగా కనిపించారు. సుమలత అంబరీశ్ ఫ్యామిలీకి వెంకటేష్ చాలా క్లోజ్. గతేడాది మాండ్య నుంచి సుమలత ఎంపీగా పోటీచేసినప్పుడు వెంకటేష్ ఆమె వెన్నంటే ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.