యాప్నగరం

ప్రేమ అంత సులువు కాదు

ఒకరు మాత్రమే ఘాడంగా ప్రేమించి అవతలి వారు ప్రేమించకపోతే అదో రకమైన బాధ, అదే ఆ అమ్మాయి ఇంకొకరిని ప్రేమిస్తే అది ఇంకా చెప్పలేని బాధ. ఇలా బాధ పడే వన్ సైడ్ లవర్స్ ఎంతో మంది ఉంటారు...

TNN 30 Aug 2016, 2:52 pm
ఒకరు మాత్రమే గాడంగా ప్రేమించి అవతలి వారు ప్రేమించకపోతే అదో రకమైన బాధ, అదే ఆ అమ్మాయి ఇంకొకరిని ప్రేమిస్తే అది ఇంకా చెప్పలేని బాధ. ఇలా బాధ పడే వన్ సైడ్ లవర్స్ ఎంతో మంది ఉంటారు. మనస్సుకు కష్టంగా అనిపించే ఇలాంటి బాధనే ఇతివృత్తంగా తీసుకొని బాలీవుడ్ లో 'ఏ దిల్ హై ముష్కిల్' అనే సినిమాను కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ ప్రధాన పాత్రలుగా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ తెరకెక్కుతుంది. కరణ్ జోహార్ సినిమాలు అంటేనే చాలా భావోద్వేగాలతో కూడి ఉంటాయి. ఆయన రూపొందించిన కుచ్ కుచ్ హోతా హై, కభి ఖుషి కభి ఘమ్. కభి అల్విదా న కెహనా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. వీటి తర్వాత కరణ్ 'ఏ దిల్ హై ముష్కిల్'ను తెరకెక్కిస్తున్నారు. ప్రీతమ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఎ దిల్ హై ముష్కిల్ అంటూ సాగే డీప్ లవ్ సాంగ్ వీడియో టీజర్ విడుదల చేశారు.
Samayam Telugu karan johars ae dil hai mushkil teaser
ప్రేమ అంత సులువు కాదు



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.