యాప్నగరం

నాని ‘చెలియా’ను ఎందుకు వదిలేశాడబ్బా..?

మణిరత్నం కథ నానీకి నచ్చలేదా.. లేక బిజీగా ఉండి సినిమా చేయలేదా

TNN 16 Feb 2017, 6:42 pm
ప్రేమ కథలను తెరకెక్కించడంలో దర్శకుడు మణిరత్నం శైలే వేరు. అతని డైరెక్షన్‌లో నటించాలని చాలా మంది నటీనటులు ఆశిస్తుంటారు. అలాంటిది ఓ సరికొత్త ప్రేమ కథను తీసుకుని నాని వద్దకు మణిరత్నం వస్తే.. అతను మాత్రం ఆ సినిమా చేయడం కుదరదని చెప్పేశాడట. దీంతో మణిరత్నం మరో హీరో కార్తీతో ఆ చిత్రాన్ని ‘చెలియా’ పేరుతో తెరకెక్కించి త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నాడు.
Samayam Telugu karthi replaced nani in maniratnam film
నాని ‘చెలియా’ను ఎందుకు వదిలేశాడబ్బా..?


మణిరత్నం చెలియా సినిమా కోసం తొలుత నానిని సంప్రదించినట్లు తాజాగా వెలుగులోకి రావడంతో అందరూ ఆ సినిమాను నాచరుల్ స్టార్ ఎందుకు ఒప్పుకోలేదని.. కారణాలు వెతికే పనిలో పడ్డారట. అయితే మణిరత్నం కథ వినకముందే నాని రెండుకు పైగా సినిమాలకు సంతకం చేసేశాడని దీంతో డేట్లు సర్దుబాటు చేయలేక వదులుకున్నట్లు చెప్పకుంటున్నారు. మరోవైపు కథ నచ్చకనే ఆ సినిమాని ఒప్పుకోలేదనే టాక్ కూడా నడుస్తోంది. ఏది ఏమైనా ఇటీవల విడుదలైన ’నేను లోకల్‘ సినిమా హిట్ అవడంతో నాని మంచి జోష్‌లో ఉన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.