యాప్నగరం

రాయుడు రాకతో.. పాత రికార్డ్స్ పోక సాధ్యమేనా!

కాటమరాయుడు మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ సినిమా టాక్ సంగతి పక్కన పెడితే.. ఈ మూవీ క్రియేట్ చేసే రికార్డ్స్ ఎలా ఉండబోతున్నాయన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

TNN 23 Mar 2017, 4:53 pm
ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా హిట్ టాక్ కంటే ఎంత కలెక్ట్ చేసింది. ఓవర్సీస్‌లో ఎంత వసూళ్లను సాధించిందనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాటమరాయుడు సినిమా రిలీజ్ అవుతుందని తెలిసినప్పటి నుండి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయబోతుందనే ఆలోచనలోనే అటు చిత్రబృందం ఇటు అభిమానులు ఉన్నారు.
Samayam Telugu katamarayudu first day collections estimation
రాయుడు రాకతో.. పాత రికార్డ్స్ పోక సాధ్యమేనా!


బాహుబలి, ఖైదీ నెంబర్ 150, శ్రీమంతుడు వంటి సినిమాలు కాకముందు వరకు కూడా పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా టాలీవుడ్ లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఉండేది. కానీ ఇప్పుడు దాని ప్లేస్ మారింది. బాహుబలి మొదటి స్థానంలో ఉండగా రీసెంట్‌గా విడుదలయిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా రెండో స్థానంలో ఉంది. శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

పవన్‌కు ఇదే సరైన అవకాశం కాటమరాయుడు కలెక్షన్స్‌తో ఆయన టాప్ మూడు స్థానాల్లో చోటు దక్కించుకోగలిగితే సినిమాపై ఉన్న అంచనాలను చేరుకున్నట్లే. ఇప్పటికే 100 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక వంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. టికెట్స్ రేట్లను కూడా పెంచారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కలెక్షన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.