యాప్నగరం

కాటమరాయుడు హ్యాండ్ ఇచ్చేశాడు!

కాటమరాయుడు సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే అన్నిఏరియాలకు ప్రింట్స్ కూడా అందినట్లు సమాచారం.

TNN 23 Mar 2017, 4:28 pm
కాటమరాయుడు సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే అన్నిఏరియాలకు ప్రింట్స్ కూడా అందినట్లు సమాచారం. అయితే ఈసారి పవన్ నుండి మరిన్ని విషయాలుతెలుసుకోవాలనుకున్న మీడియాకు మాత్రం పవన్ హ్యాండ్ ఇచ్చేశాడు.
Samayam Telugu katamarayudu pawan no interviews on katamarayudu
కాటమరాయుడు హ్యాండ్ ఇచ్చేశాడు!


తన పాత స్టయిల్‌లోనే ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా కామ్‌గా సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. సర్ధార్ సినిమాకు పవన్ లోకల్ మీడియాతో పాటు నేషనల్ మీడియాను కూడా పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. దీంతో కాటమరాయుడు సినిమాకు కూడా అలానే ఇస్తాడని అందరూ భావించారు.

కానీ ఇప్పటికే సినిమాకు కావల్సిన హైప్ వచ్చేసింది కాబట్టి పవన్ మీడియాను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ కొందరు మాత్రం సెంటిమెంట్ తోనే పవన్ ఇంటర్వ్యూలు ఇవ్వకుండా మీడియాకు దూరంగా ఉంటున్నాడని ప్రచారం చేస్తున్నారు.

వ్యక్తిగతంగా సర్ధార్ సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూల కారణంగా సినిమా ఫ్లాప్ అయిందని అందుకే ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఈసారి రిపీట్ చేయలేదని అంటున్నారు. ఏదైతేనేం పవన్ ఇంటర్వ్యూలతో టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవాలనుకున్న ఛానళ్ళు మొత్తం కాటమరాయుడు నిర్ణయంతో నిరాశ చెందారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.