యాప్నగరం

‘అజ్ఞాతవాసి’పై కత్తి మహేష్ రివ్యూ ఇది..

అజ్ఞాతవాసి సినిమా గురించి కత్తి మహేష్ స్పందన ఇది. అత్యంత క్లుప్తంగా కత్తి సినిమా గురించి చెప్పేశాడు.

TNN 10 Jan 2018, 1:37 pm
భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అజ్ఞాతవాసి’ సినిమా పట్ల మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. అభిమానులు సినిమా హిట్ అంటుండగా.. సాధారణ ప్రేక్షకులు మాత్రం యావరేజ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్‌‌‌పై వరుసగా విమర్శలు చేస్తోన్న కత్తి మహేష్ ఈ సినిమా గురించి ఏం చెబుతాడనే విషయం ఆసక్తి రేపింది. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ గురించి కత్తి మహేష్ రాసిన రివ్యూ కాసేపట్లోనే వైరల్‌గా మారింది.
Samayam Telugu kathi mahesh review on agnyaathavaasi
‘అజ్ఞాతవాసి’పై కత్తి మహేష్ రివ్యూ ఇది..


‘సీరియస్ కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టి సినిమాను అపహాస్యం చేసిన సినిమా అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కెరీర్‌లో అత్యంత దారుణమైన సినిమా. రిస్క్ చేసి చూస్తే... టైమెమో... మీ ఇష్టం! (ఈ సినిమా పాట ట్యూన్ లో)’ అంటూ కత్తి మహేష్ ట్విట్టర్ ద్వారా సినిమా గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాగా, నెగటివ్‌గా రివ్యూ అందించిన కత్తిపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

సీరియస్ కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టి సినిమాను అపహాస్యం చేసిన సినిమా అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కెరీర్ లో అత్యంత దారుణమైన సినిమా. రిస్క్ చేసి చూస్తే...టైమెమో... మీ ఇష్టం!(ఈ సినిమా పాట ట్యూన్ లో). — Kathi Mahesh (@kathimahesh) January 10, 2018

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.