యాప్నగరం

‘పవన్ ఆగ్రహం.. వెనక్కి వెళ్లిన సముద్రం’.. దీనమ్మ బడవ ఏందయ్య ఇది?

ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు రాజధాని సెగలు రేగుతుంటే.. కాకినాడలో వైసీపీ వర్సెస్ జనసేన‌‌గా పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Samayam Telugu 15 Jan 2020, 8:12 pm
‘ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడ వస్తా.. అక్కడే తేల్చుకుంటా’.. అని శపథం చేసిన పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే మంగళవారం నాడు కాకినాడ వచ్చి ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన తీవ్ర వ్యాఖ్యలు జనసైనికుల్లో ఆగ్రహం తెప్పించాయి.
Samayam Telugu Pawan
పవన్ కళ్యాణ్


దీంతో ద్వారంపూడి ఇంటిని ముట్టడించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి గాయాలపాలయ్యారు. అయితే తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడం పవన్ కళ్యాణ్‌కి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఢిల్లీ నుండి కాకినాడకు వెళ్లారు.. అయితే ప్రభుత్వంతో ఏం తేల్చుకున్నారన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే.. గాయాల పాలైన జనసైనికుల్నైతే పరామర్శించారు పవన్ కళ్యాణ్.

కాకినాడలో పవన్


కాగా పవన్ కళ్యాణ్ ఏం చేసినా విమర్శించే వ్యక్తుల్లో ముందు ఉండే కత్తి మహేష్ ఈ ఇష్యూపై సెటైర్లు వేస్తున్నారు. ప్రభుత్వంతో తేల్చుకుంటా.. అది చేస్తా ఇది చేస్తా అని డైలాగ్‌లు పేల్చిన పవన్‌ ఏం చేశారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

‘కాకినాడలో జనసేనాని ఉగ్రరూపం చూసి నాలుగు అడుగులు వెనక్కి వెళ్లిన సముద్రం. నేలకి ఒంగిన ఆకాశం. పది అడుగులు కృంగిన భూమి. అమరావతి రాజధాని కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్న జనసేనానికి అభినందనలు’ అంటూ వరుస పోస్ట్‌లు చేసి జనసైనికుల్ని మరింత రెచ్చగొడుతున్నాడు కత్తి.

ఇక గాయాలపాలైన జనసైనికుల ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లగా.. అక్కడ ఓ వ్యక్తి కాలు నుండి రక్తం కారుతూ ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై కూడా కత్తి కట్టాడు కత్తి మహేష్. ‘పవర్ స్టార్ చెయ్యేస్తే ఆమాత్రం రక్తం కారదా... గాయం ఆదివారంది.. అయితేనేం... ఆదిమకాలం నాటిది అయితే ఏం!? అంటూ పంచ్‌లు పేల్చాడు.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.