యాప్నగరం

Hippi Movie: ‘హిప్పీ’ దర్శకుడిది హాఫ్ నాలెడ్జ్.. కత్తి మహేష్ షాకింగ్ రివ్యూ

‘లివ్-ఇన్ రిలేషన్షిప్ అంటే ఒక ఆడామగా జంట కలిసి, వేరువేరు బెడ్రూమ్ లలో బ్రతకడం కాదు.. కత్తి అభిప్రాయంలో లివ్-ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే..

Samayam Telugu 6 Jun 2019, 6:09 pm
మూవీ క్రిటిక్ మహేష్ కత్తి మరోసారి కత్తిదూశాడు. ‘RX 100’ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న కార్తికేయ నటించిన ‘హిప్పీ’ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు (జూన్ 6)న విడుదలైంది. సూర్య, భూమికతో ‘నువ్వు నేను ప్రేమ’ చిత్రాన్ని రూపొందించిన టీఎన్ క్రిష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. దిగంగన సూర్యవంశీ, జబ్బా సింగ్‌లు హీరోయిన్స్‌గా నటించారు.
Samayam Telugu కత్తి మహేష్ హిప్పీ రివ్యూ


Read Also:‘హిప్పీ’ మూవీ రివ్యూ కోసం క్లిక్ చేయండి.

లివ్-ఇన్ రిలేషన్షిప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బోల్డ్ కంటెంట్‌తో నింపేశారు దర్శకుడు టీఎన్ క్రిష్ణ. యూత్ టార్గెట్ చేస్తూ లవ్, రొమాన్స్, సెక్స్, లివ్-ఇన్ రిలేషన్షిప్ (సహజీవనం) లాంటి అంశాలపై ప్రజెంట్ జనరేషన్‌ ఎలా ఉంటున్నారు? వారి ఆలోచనలు ఏంటి అన్న విషయాన్ని తెలియజేస్తూనే ఓ పది సంవత్సరాల తరువాత నెక్స్ట్ జనరేషన్ ప్రేమ, పెళ్లి విషయంలో ఎలా ఉండబోతున్నారనే విషయాన్ని దర్శకుడి ఆలోచనలో చాలా బోల్డ్‌గా చూపించారు. శుక్రవారం నాడు విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ వినిపిస్తుండగా.. మూవీ క్రిటిక్ మహేష్ కత్తి ‘హిప్పీ’ చిత్రానికి షాకింగ్ రివ్యూ ఇచ్చారు. దర్శకుడు టీఎన్ క్రిష్ణను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు.

‘లివ్-ఇన్ రిలేషన్షిప్ అంటే ఒక ఆడామగా జంట కలిసి, వేరువేరు బెడ్రూమ్‌లలో బ్రతకడం కాదు. ఫుడ్డు-బెడ్డు కూడా కలిసి పంచుకుని ఒక ఇంట్లో జీవించడం. పెళ్లి కాకుండానే మొగుడూ పెళ్లాలల్లాగా సంసారం చెయ్యడం...ఈ పిచ్చి హాఫ్ నాలెడ్జ్ దర్శకులకి ఈ విషయం ఎవరైనా చెప్పండయ్యా’ అంటూ ఇన్ డైరెక్ట్‌గా దర్శకుడు టీఎన్ క్రిష్ణను టార్గెట్ చేస్తూ షాకింగ్ రివ్యూ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.