యాప్నగరం

అన్నదమ్ములతో కీర్తి రొమాన్స్!

ఇండస్ట్రీకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోతుంది కీర్తి సురేష్. తమిళంలో విజయ్, సూర్య వంటి స్టార్ హీరోల సినిమాలు చేస్తూనే ఇటు శివ కార్తికేయన్ వంటి యువ హీరోలతోనూ నటిస్తుంది

TNN 28 Nov 2016, 9:04 pm
ఇండస్ట్రీకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోతుంది కీర్తి సురేష్. తమిళంలో విజయ్, సూర్య వంటి స్టార్ హీరోల సినిమాలు చేస్తూనే ఇటు శివ కార్తికేయన్ వంటి యువ హీరోలతోనూ నటిస్తుంది. అలానే టాలీవుడ్ లో పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో జత కట్టడానికి రెడీ అయిపోతుంది.
Samayam Telugu keerthi romance with karthi after suriyas thaana serndha kootam
అన్నదమ్ములతో కీర్తి రొమాన్స్!


తాజాగా ఈ బొద్దుగుమ్మ సూర్య నటిస్తోన్న 'తానా సెర్నధ కూటం' అనే సినిమాలో చాన్స్ కొట్టేసిందట. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లింది. అయితే కార్తీ అటు మణిరత్నం సినిమాలో నటిస్తూనే.. వినోద్ అనే మరో దర్శకుడితో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను సంప్రదిస్తున్నారు. ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో తమన్నా కూడా సూర్యతో 'అయన్' అనే సినిమాలో నటించింది. ఆ వెంటనే సూర్య తమ్ముడు కార్తీతో 'ఫైయా' అనే సినిమా నటించి రెండు విజయాలు అందుకుంది. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా తమన్నా బాటలోనే మొదట సూర్యతో తరువాత కార్తీతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.