యాప్నగరం

​నయనతార ప్రేమకథ.. ఆమె నో కామెంట్!

నయనతార ప్రేమ కథపై కామెంట్ చేయడానికి నో.. అనేసింది

TNN 16 Aug 2017, 11:21 am
నయనతార ప్రేమ కథపై కామెంట్ చేయడానికి నో.. అనేసింది కీర్తీ సురేష్. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో యమ బిజీగా ఉన్న తారల్లో కీర్తీ సురేష్ ఒకరు. ఎంతలా బిజీ అంటే.. ఉన్న ఫలంగా రెండు కోట్ల రూపాయల పై స్థాయి పారితోషకాన్ని అడిగేస్తోందట కీర్తి. అయినప్పటికీ ఈమెను అవకాశాలు వరించి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సూర్య సరసన ఒక సినిమాలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఈమె వద్ద నయనతార ప్రేమ ప్రస్తావన తెచ్చింది మీడియా.
Samayam Telugu keerthi suresh responds on nayanatara love story
​నయనతార ప్రేమకథ.. ఆమె నో కామెంట్!


మరి ఆ ప్రస్తావన కీర్తి వద్ద ఎందుకు? అంటే.. సూర్య హీరోగా, కీర్తి హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు దర్శకుడు విఘ్నేష్ శివన్. ఈ డైరెక్టర్ మరెవరో కాదు.. నయనతార బాయ్ ఫ్రెండే. ప్రస్తుతం నయనతార, విఘ్నేష్ లు ప్రేమలో ఉన్నారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. వీరిద్దరూ కలిసి ఫొటోలు దిగుతూ, వాటిని సోషల్ మీడియాలో పెడుతూ ప్రేమను ధ్రువీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విఘ్నేష్ పై కీర్తి అభిప్రాయాన్ని అడిగింది మీడియా. అతడు చాలా టాలెంటెడ్ అని, చక్కగా డైలాగులు రాస్తాడని, అవి కూడా సహజంగా ఉండేలా చూసుకుంటాడు.. అని కీర్తి చెప్పుకొచ్చింది.

మరి ఇదే సందర్భంలో నయనతార ప్రస్తావన వచ్చింది. నయనతార- విఘ్నేష్ ల బంధం గురించి కీర్తి వద్ద ప్రస్తావించగా, ఆమె హడలిపోయినట్టుగా రియాక్ట్ అయ్యింది. దానిపై కామెంట్ చేయడానికి నిరాకరించింది. ‘నాకూ ఆ వ్యవహరంతో సంబంధం లేదు. నాకు దాని గురించి ఏం తెలీదు..’ అని తేల్చి చెప్పింది. ఈ మాటలతో కీర్తీ సురేష్ భయం స్పష్టం అయిపోయింది. నయనతార, విఘ్నేష్ ల బంధం గురించి ఏం కామెంట్ చేస్తే, ఏ ప్రమాదం ముంచుకొస్తుందో.. అని నో కామెంట్ అంటూ తప్పించేసుకుంది. తెలివైన పిల్లే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.