యాప్నగరం

Good Luck Sakhi ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్

కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన గుడ్ లక్ సఖి సినిమా ఈ వారం థియేటర్లోకి రానుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రయూనట్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది.

Samayam Telugu 23 Jan 2022, 11:15 am

ప్రధానాంశాలు:

  • ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న కీర్తి సురేష్
  • ఈ వారమే థియేటర్లోకి గుడ్ లక్ సఖీ
  • జనవరి 24న రాబోతోన్న మూవీ ట్రైలర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Good Luck Sakhi ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్
Keerthy Suresh GLS
కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి సినిమాను బ్యాడ్ లక్ వెంటాడుతూనే వచ్చింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ పలు మార్లు వాయిదాలు పడుతూ వచ్చింది. థియేటర్లో విడుదల చేయాలా? ఓటీటీకి ఇచ్చేయాలా? అని మేకర్లు కూడా చాలానే తర్జనభర్జనలు పడ్డట్టు కనిపిస్తోంది. మొత్తానికి గత ఏడాది నవంబర్‌లో ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు. మళ్లీ వాయిదా వేశారు. డిసెంబర్‌లో వచ్చేందుకు రెడీ అయ్యారు. మళ్లీ వెనక్కి వెళ్లారు. మొత్తానికి ఇప్పుడు మాత్రం ముందడుగు వేసేశారు.
ఆది పినిశెట్టి, జగపతి బాబు పాత్రలు ఈ సినిమాకు బలంగా మారనున్నట్టు తెలుస్తోంది. జనవరి 28న గుడ్ లక్ సఖి సినిమా విడుదల కానుంది. పోటీలో మరే చిత్రం కూడా విడుదల కావడం లేదు. ఒక వేళ టాక్ బాగుంటే.. సినిమాకు మంచి వసూళ్లే వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అయింది.

జనవరి 24న ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయాలని చిత్రయూనిట్ నిర్ణయించింది. ఉదయం పది గంటల 11 నిమిషాలకు ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేయబోతోంది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో కీర్తి సురేష్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. దిల్‌రాజు సమర్పణలో 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్' బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి ఈ చిత్రాన్ని నిర్మించగా.. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.