యాప్నగరం

PSPK25 కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ పీఎస్‌పీకే 25 సినిమాలో పవర్ స్టార్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

TNN 17 Oct 2017, 6:15 pm
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ పీఎస్‌పీకే 25 సినిమాలో పవర్ స్టార్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోంచి కీర్తి సురేష్‌కి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది ఆ చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్. కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు చెబుతూ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేసింది.
Samayam Telugu keerthy sureshs birthday special poster released from pspk25 makers
PSPK25 కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్


త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా నుంచి గతంలోనే పవన్, కీర్తి సురేష్ ఇద్దరూ కలిసి వున్న ఫోటో ఒకటి రిలీజవడమేకాకుండా ఇంటర్నెట్‌లో సందడి చేస్తోంది కూడా. కాకపోతే కీర్తి సురేష్ మాత్రమే విడిగా వున్న ఈ ఫోటో మాత్రం ఇది మొదటిది కావడం విశేషం.

Wishing a very Happy Birthday to the gorgeous @KeerthyOfficial ! #TeamPSPK25 #HaarikaHassine pic.twitter.com/O5dQDDxxyd— Haarika & Hassine C (@haarikahassine) October 17, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.