యాప్నగరం

ఖైదీ నెంబర్ 150: 4 రోజుల కలెక్షన్స్

ఖైదీ నెంబర్ 150 కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇంటా, బయటా (ఓవర్సీస్) ఖైదీ బాక్సాఫీస్ కలెక్షన్లు...

TNN 15 Jan 2017, 9:21 pm
ఖైదీ నెంబర్ 150 కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇంటా, బయటా (ఓవర్సీస్) ఖైదీ బాక్సాఫీస్ కలెక్షన్లు బాగున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రిలీజైన తొలిరోజే ఓవర్సీస్‌తో కలిపి మొత్తం రూ. 35 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసిన ఖైదీ నెంబర్ 150.. ఓవర్సీస్‌లో అదే ఊపుని కంటిన్యూ చేస్తూ 2 మిలియన్లకు చేరువవుతోందని చెబుతున్నారు ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్. రిలీజైన రోజు ఓవర్సీస్‌లోనే రూ. 8 కోట్లు వసూలు చేసిందీ సినిమా.
Samayam Telugu khaidi no 150 4 days total collections
ఖైదీ నెంబర్ 150: 4 రోజుల కలెక్షన్స్


ఖైదీ నెంబర్ 150 రెండవ రోజు ఇండియాలో రూ.18 కోట్లు రాబట్టగా ఓవర్సీస్‌లో రూ.1.8 కోట్లు కలెక్ట్ చేసింది. 3వ రోజు మొత్తం రూ.16 కోట్లు రాబట్టిన ఈ చిత్రం 4వ రోజున రూ.10 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు ఈ చిత్రం రూ.78 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. కత్తి మూవీని రీమేక్ చేయడంపై కొంతమంది క్రిటిక్స్ విమర్శించినప్పటికీ... బీ, సీ సెంటర్లలో సినిమా బాగా పర్‌ఫామ్ చేయడంతో బాహుబలి కాకుండా ఇతర చిత్రాల పేరిట వున్న కొన్ని రికార్డులని 'ఖైదీ నెంబర్ 150' చిత్రం తన సొంతం చేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.