యాప్నగరం

ఖైదీ నెంబర్ 150 సినిమా మధ్యలో వెంకీ సర్‌ప్రైజ్

ఖైదీ నెంబర్ 150 సినిమా చూడ్డానికి వెళ్లిన ఆడియెన్స్‌కి అక్కడే ఇంకో సడెన్ సర్‌ప్రైజ్ కూడా కనిపించనుంది.

Samayam Telugu 10 Jan 2017, 8:01 pm
ఖైదీ నెంబర్ 150 సినిమా చూడ్డానికి వెళ్లిన ఆడియెన్స్‌కి అక్కడే ఇంకో సడెన్ సర్‌ప్రైజ్ కూడా కనిపించనుంది. మెగాస్టార్ సినిమా ఇంటర్వెల్ గ్యాప్‌లో విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇచ్చుకోనున్నాడు. వెంకీ హీరోగా తెరకెక్కుతున్న గురు మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో వుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ట్రైలర్‌ని కూడా జనవరి 11నే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అలా ఖైదీ నెంబర్ 150 మూవీ మధ్యలో గురు థియేట్రికల్ ట్రైలర్ వీక్షించవచ్చన్నమాట.
Samayam Telugu khaidi no 150 venkateshs guru trailer in chiranjeevis 150th film
ఖైదీ నెంబర్ 150 సినిమా మధ్యలో వెంకీ సర్‌ప్రైజ్


సాలా ఖదూస్ అనే హిందీ సినిమాను గురు పేరిట తెలుగులో శశికాంత్ నిర్మిస్తున్న ఈ సినిమాను సుధా కొంగర ప్రసాద్ డైరెక్ట్ చేస్తున్నారు. రితిక సింగ్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. థమన్ అందించిన మ్యూజిక్ ఈ నెలలోనే విడుదలకి రెడీ అవుతోంది. రిటైర్డ్ బాక్సర్ పాత్రలో నటిస్తున్న వెంకీ... తన స్టూడెంట్‌కి విజయాన్ని చేకూర్చే క్రమంలో ఏం ఇబ్బందులు ఎదుర్కున్నాడనేదే ఈ సినిమా కథాంశం. ఇంకొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.