యాప్నగరం

‘ఖాకీ’ టీజర్: ది పవర్ ఆఫ్ పోలీస్

కార్తి పవర్ ఫుల్ పోలీస్ ఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఖాకీ’. ‘ది పవర్ ఆఫ్ పోలీస్’ అనేది ట్యాగ్ లైన్.

TNN 27 Sep 2017, 7:50 pm
కార్తి పవర్ ఫుల్ పోలీస్ ఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఖాకీ’. ‘ది పవర్ ఆఫ్ పోలీస్’ అనేది ట్యాగ్ లైన్. కోలీవుడ్‌లో ‘శతురంగ వేట్టై’ వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన వినోద్ ‘ఖాకీ’కి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా తెలుగు, తమిళ టీజర్లను బుధవారం విడుదల చేశారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా విడుదలైన టీజర్ కూడా ఆకట్టుకుంటోంది. వరుసగా ‘కాష్మోరా’, ‘చెలియా’ చిత్రాలు నిరాశపరచడంతో ఇప్పుడో హిట్ కోసం కార్తి ఎదురుచూస్తున్నాడు.
Samayam Telugu khartis khakee telugu movie official teaser
‘ఖాకీ’ టీజర్: ది పవర్ ఆఫ్ పోలీస్


‘ధీరం అధిగారం ఒండ్రు’ పేరుతో తమిళంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ఆదిత్య మ్యూజిక్ తెలుగు ప్రేక్షకులకు అందించబోతుంది. ఇప్పటి వరకూ ఆడియో రంగంలో ఉన్న ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేశ్ గుప్తా ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. కాగా, ‘ఖాకీ’లో కార్తి సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. జిబ్రాన్ సంగీత దర్శకుడు. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో దర్శనమివ్వబోతున్న కార్తి.. ‘ఖాకీ’ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.