యాప్నగరం

మహేశ్ హీరోయిన్.. దూసుకుపోతోంది!

ఇక ఇంతలోనే ఈమెకు హిందీ ‘అర్జున్ రెడ్డి’లో అవకాశం దక్కింది. ఇది అనూహ్యమే. ముందుగా వేరే హీరోయిన్‌ని అనుకున్నారు

Samayam Telugu 2 Oct 2018, 1:59 pm
‘భరత్ అనే నేను’ సినిమాకు ముందు బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్నా, కియరాను పెద్దగా పట్టించుకున్న వాళ్లు లేరు. ధోనీ బయోపిక్‌లో నటించినా రాని గుర్తింపు ‘భరత్ అనే నేను’తో దక్కింది ఈమెకు. నటించింది ప్రాంతీయ భాషలో అయినా.. బాలీవుడ్‌లో కూడా కియరా కెరీర్ ‘భరత్..’ తర్వాతే పుంజుకుంటోంది. ప్రస్తుతం కియరా తెలుగులో మరో స్టార్ హీరోతో నటిస్తోంది. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో కియరా హీరోయిన్.
Samayam Telugu 6


ఇక ఇంతలోనే ఈమెకు హిందీ ‘అర్జున్ రెడ్డి’లో అవకాశం దక్కింది. ఇది అనూహ్యమే. ముందుగా వేరే హీరోయిన్‌ని అనుకున్నారు రూపకర్తలు. అయితే ఆ ఛాన్స్ చివరకు కియరా వద్దకు వచ్చింది. పక్కింటమ్మాయి తరహా పాత్రకు కియరా చక్కగా అమరుతుంది. భరత్ అనే నేనుతో ఆ విషయం రుజువైంది.

ఇక ‘లస్ట్ స్టోరీస్’ ద్వారా తను బోల్డ్ గా కూడా నటించగలను అని కియరా నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్‌గా కియరా వంద శాతం సెట్ అయ్యే అవకాశాలున్నాయి. రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా, బాలీవుడ్ అర్జున్ రెడ్డిలు విడుదల అయితే.. కియరా కెరీర్ మరింత ఊపందుకునే అవకాశాలున్నాయి. స్టార్ హీరోయిన్ గా మరాఠీ భామ సెటిల్ అయ్యే ఛాన్సులున్నాయి.

కియరా అద్వానీ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.