దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా దర్శకుడు మహీ వీ రాఘవ్ రూపొందిస్తున్న ‘యాత్ర’ సినిమా గురించి ఆసక్తిదాయకమైన ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి ఇందులో నటించబోయే వారి జాబితా ఆసక్తిదాయకంగా మారింది. ముందుగా ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మమ్ముట్టీ నటించబోతున్నాడనే ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని దీని రూపకర్తలు ధ్రువీకరించారు.
ఇక ఈ సినిమాలో వైఎస్ రాజారెడ్డి పాత్ర కూడా ఉంటుందని.. ఆయన పాత్రలో తమిళనటుడు రాజ్ కిరణ్ కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించి ఇంకా ధ్రువీకరణ లేదు. ఇక ఇప్పుడు ఇంతకు మించిన ఆసక్తిదాయకమైన ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే.. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో స్టార్ హీరో సూర్య నటించనున్నాడట.
వైఎస్ బయోపిక్ లో జగన్ ప్రస్తావన తప్పనిసరిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ పాత్రలో సూర్య కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో వైఎస్ విజయమ్మ పాత్రలో నటి శరణ్య కనిపిస్తుందట. ఈ సినిమాలో షర్మిల పాత్రలో కూడా ఒక స్టార్ నటీమణి కనిపిస్తుందని సమాచారం.