యాప్నగరం

ఒక్కరోజుకే అన్ని లైకులా... విజయ్ ‘మాస్టర్’ టీజర్ అరాచకం

దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా టీజర్ యూట్యూబ్‌లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 22 మిలియన్ వ్యూస్ దక్కగా.. 1.9 మిలియన్ లైకులు సొంతం చేసుకుంది.

Samayam Telugu 16 Nov 2020, 6:54 am
కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మాస్టర్‌'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ టీజర్ సోషల్‌ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 24 గంటలు గడవకముందే ఏకంగా 16 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడంతో పాటు 1.7 మిలియన్ లైక్స్ సాధించి ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు 22 మిలియన్ వ్యూస్ దాటగా.. 1.9మిలియన్ లైకులతో ఎవరినీ అందని ఎత్తులో నిలిచింది ఈ టీజర్
Samayam Telugu విజయ్ మాస్టర్ టీజర్


Also Read: గొడవతోనే మా పరిచయం మొదలు.. నేను చేయనని రాజమౌళికి చెప్పేశా: ఎన్టీఆర్ గురించి రాజీవ్ కనకాల

కార్తితో ‘ఖైదీ’ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్ అందుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ‘మాస్టర్’పై భారీ అంచనాలున్నాయి. ఈ మధ్య విజయ్ నటించిన సినిమాలన్నీ వరుసగా వందల కోట్ల కలెక్షన్లతో దుమ్ము రేపుతున్నాయి. దీంతో లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో నేరుగా విడుదలవుతున్న ‘మాస్టర్’తో విజయ్ రికార్డు కలెక్షన్లు రాబట్టడం ఖాయమంటూ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హంగామా చేస్తున్నారు. ఇందులో విజయ్ సరసన మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండటం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.