యాప్నగరం

వాళ్లూ మనుషులే.. హద్దులు మీరొద్దు: కత్తి వ్యాఖ్యలపై కోన స్పందన

సినిమా హీరోలు కోల్పోయే వాటిలో మొదటిది స్వేచ్ఛ అని రచయిత, దర్శకుడు కోన వెంకట్ అన్నారు. వారిని వ్యక్తిగతంగా విమర్శించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.

TNN 7 Jan 2018, 4:53 pm
సినిమా హీరోలు కోల్పోయే వాటిలో మొదటిది స్వేచ్ఛ అని రచయిత, దర్శకుడు కోన వెంకట్ అన్నారు. వారిని వ్యక్తిగతంగా విమర్శించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా సినీ హీరోలపై సోషల్ మీడియా వేదికగా వస్తోన్న విమర్శలు, ఆరోపణలు (ముఖ్యంగా కత్తి మహేష్‌ను ఉద్దేశించి) గురించి ఫేస్‌బుక్ లైవ్ ద్వారా కోన వెంకట్ మాట్లాడారు. సుమారు అరగంటకు పైగా ఈ అంశంపై క్షుణ్ణంగా మాట్లాడారు. హీరోలపై సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్‌లో వస్తోన్న వీడియోలు చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు.
Samayam Telugu kona venkat facebook live on kathi mahesh comments
వాళ్లూ మనుషులే.. హద్దులు మీరొద్దు: కత్తి వ్యాఖ్యలపై కోన స్పందన


స్టార్స్‌ కూడా మనుషులేనని వారి వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి, వారి గురించి హద్దులు మీరి మాట్లాడొద్దని కత్తి మహేష్‌ను ఉద్దేశించి అన్నారు. ‘పవన్‌ ఇన్ని సంవత్సరాల్లో ఒక వ్యక్తిని కూడా హర్ట్‌ చేసి ఉండరు. తన దగ్గర ఉన్న వారిని కానీ, తనతో కలిసి పనిచేసిన వారిని కానీ ఆయన బాధపెట్టి ఉండరు. మరి ఆయన్ను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నారనా? శివుడికి మూడో కన్ను ఉన్నట్టే ఆయనకూ ఉంది. సర్వేంద్రియాలపై అదుపు తెచ్చుకునేందుకు ఆయన గంటల కొద్దీ ధ్యానం చేస్తారు. ఇంత మంది ప్రజల అభిమానం సంపాదించుకున్నారంటే.. ఆయనలో గొప్ప గుణం ఉంటేనే అది సాధ్యం’ అని కోన వివరించారు. కోన చెప్పిన మరిన్ని విషయాలు వీడియోలో చూడండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.