యాప్నగరం

సమయం లేదు ‘క్రిష్’ మిత్రమా- చెర్రీ

గత కొంతకాలంగా రామ్ చరణ్ హీరోగా దర్శకుడు క్రిష్ ఓ సినిమా రూపొందించబోతున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ....

TNN 23 Jan 2017, 5:58 pm
గత కొంతకాలంగా రామ్ చరణ్ హీరోగా దర్శకుడు క్రిష్ ఓ సినిమా రూపొందించబోతున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశాలు లేనట్లుగా కనిపిస్తున్నాయి. నిజానికి వరుణ్ తేజ్ 'కంచె' సినిమాలో నటించే సమయంలోనే చరణ్, క్రిష్‌తో ఓ సినిమా చేస్తానని కమిట్ అయ్యాడు. అందుకే కంచె సినిమా ఆడియో ఫంక్షన్‌కు కూడా అతిథిగా హాజరయ్యాడు.
Samayam Telugu krish and ramcharan new project updates
సమయం లేదు ‘క్రిష్’ మిత్రమా- చెర్రీ


అయితే రీసెంట్‌గా జరిగిన కొన్ని పరిణామాల వలన చరణ్ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. క్రిష్ ఎన్ని సార్లు నేను మెగాఫ్యామిలీను ఉద్దేశించి 'శాతకర్ణి' ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడలేదని చెప్పినా.. అసలు విషయం ఏంటో అందరికీ తెలిసిందే. క్రిష్ ఉద్దేశపూర్వకంగానే అలా మాట్లాడాడని ఇప్పటికీ మెగాభిమానులు నమ్ముతున్నారు.

కాబట్టి చరణ్, క్రిష్‌కు ఛాన్స్ ఇచ్చి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. అందుకే సైలెంట్‌గా వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టేసి క్రిష్‌కు సమయం లేదని చెప్పాలని చూస్తున్నాడు. అదన్నమాట మేటర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.