యాప్నగరం

అహం బ్రహ్మాస్మి.. టైటిల్‌పై ఇద్దరు దర్శకుల పోటీ?

అహం బ్రహ్మాస్మి..ఈ టైటిల్ ఇప్పుడు రెండు సినిమాల విషయంలో వినిపిస్తోంది. అందులో ఒకటి

TNN 22 Feb 2018, 1:20 pm
అహం బ్రహ్మాస్మి.. ఈ టైటిల్ ఇప్పుడు రెండు సినిమాల విషయంలో వినిపిస్తోంది. అందులో ఒకటి క్రిష్ రూపొందించాలని అనుకుంటున్న సినిమా కాగా, మరోటి వరుణ్ తేజ్ సినిమా. క్రిష్ ఈ టైటిల్ తో ఒక సినిమా తీయాలని అనుకుంటున్నాడట. అయితే ఈ సినిమాలో హీరో ఎవరు, ఎవరెవరు నటించబోతున్నారు అనే విషయాల గురించి ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ‘మణికర్ణిక’ సినిమాతో బిజీగా ఉన్న క్రిష్, ఆగస్టులో ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాను ప్రారంభించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Samayam Telugu krish and sankalp reddy eyes on aham brahmasmi title
అహం బ్రహ్మాస్మి.. టైటిల్‌పై ఇద్దరు దర్శకుల పోటీ?


ఆ సంగతలా ఉంటే.. ఇదే టైటిల్ ను తమ సినిమాకు పరిశీలిస్తున్నారు వరుణ్ తేజ్- సంకల్ప్ రెడ్డిలు. ‘ఘాజీ’ సినిమాతో సత్తా చాటిన యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ఈ సారి అంతరిక్షం నేపథ్యంలో ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. అందులో వరుణ్ తేజ్ హీరోగా నటించడం ఖాయమైంది. ఈ సినిమాకు టైటిల్ గా ‘అహ్మం బ్రహ్మాస్మి’ని ఖరారు చేసినట్టుగా సమాచారం.

ఈ విధంగా ఒకే టైటిల్ విషయంలో రెండు సినిమాలు ప్రతిపాదనలోకి వచ్చాయి. మరి ఈ టైటిల్ ను వీరిద్దరిలో ఎవరు రిజిస్టర్ చేయించారో ఇంకా స్పష్టత లేదు. ఇద్దరు ప్రయోగాత్మాక సినిమాల దర్శకులు ఒకే టైటిల్ ను అనుకుంటూ ఉండటంతో.. దీన్ని ఎవరు సొంతం చేసుకుంటారనేది ఆసక్తిదాయకంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.