యాప్నగరం

శాతకర్ణికి సీక్వెల్‌గా ప్రేమ కథ!

బాలకృష్ణ నటించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా ఘన విజయం సాధించడంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో క్రిష్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

TNN 24 Jan 2017, 10:38 pm
బాలకృష్ణ నటించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా ఘన విజయం సాధించడంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో క్రిష్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శాతకర్ణి సినిమా సమయంలో క్రిష్ పరోక్షంగా సీక్వెల్ ఉంటుందనే చెప్పాడు.
Samayam Telugu krish reveals his intentions of gautamiputra satakarni sequel
శాతకర్ణికి సీక్వెల్‌గా ప్రేమ కథ!


శాతకర్ణి పుత్రుడు వశిష్టపుత్ర పులోమావి కథపై ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. శాతకర్ణి సినిమా మొత్తం యుద్ధాలు, సామ్రాజ్యాలు దిశగా సాగింది. అయితే పులోమావి సినిమా పూర్తి ప్రేమ కథగా తెరకెక్కుతోందని సమాచారం. పులోమావి తను ప్రేమించిన శ్రావణిల మధ్య జరిగే ప్రేమ కథగా ఈ చిత్రాన్ని రూపొందించాలని క్రిష్ అభిప్రాయపడుతున్నాడు.

ఇప్పటికే శ్రావణి అనే పేరుతో ప్రముఖ రచయిత ఓ నవలను రచించారు. ఇప్పుడు ఆ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తారని అంటున్నారు. ఇప్పటివరకు చరిత్రలో నిలిచిపోయిన ప్రేమ కథల సరసన ఈ సినిమా కూడా నిలిచేలా ఉండాలని క్రిష్ ఆలోచిస్తున్నాడు. ఈ సినిమా విషయంలో మరింత జాగ్రత్త తీసుకోనున్నాడు.

అయితే ఈ సినిమాను సెట్స్ పైకి ఎప్పుడు తీసుకువెళ్తారు, ముఖ్య పాత్రలు పోషించేదెవరనే విషయాలు తెలియాల్సివుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.