Macherla Niyojakavargam : మళ్లీ పని చేసే అవకాశం ఇవ్వండి.. స్టేజ్ మీదే కోరిన కృతి శెట్టి
నితిన్ (Nithiin) కృతి శెట్టి (Krithi Shetty) కాంబినేషన్లో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) సినిమా ఆగస్ట్ 12న రాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ప్రధానాంశాలు:
- ఆగస్ట్ 12న రానున్న మాచర్ల నియోజకవర్గం
- ఆదివారం నాడు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
- క్యూట్ స్పీచ్ ఇచ్చిన కృతి శెట్టి
నితిన్ ప్రస్తుతం మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రాబోతోన్నాడు. మాచర్ల నియోజకవర్గం అంటూ ఇది వరకే టీజర్, ట్రైలర్లతో అంచనాలు పెంచేశాడు. ఇక ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు పీక్స్‌కు చేర్చారు. ఆగస్ట్ 12న రాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో కృతి శెట్టి మాట్లాడింది కాసేపే అయినా కూడా అందరినీ ఆకట్టుకుంది. కృతి శెట్టి మాట్లాడుతూ.. ‘అప్పటి నుంచి మీరు అరుస్తూనే ఉన్నారు.. ఇంత ప్రేమను చూపిస్తున్నారు.. అందరికీ థాంక్స్. నితిన్ గారు ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తారు. క్లాస్ మాస్ మిక్స్ చేసి నితిన్ గారు నటించారు. అద్భుతంగా అనిపిస్తుంది. ఆయనలాంటి ఓ మిత్రుడు దొరకడం ఆనందంగా ఉంది.
స్వాతి లాంటి ఓ మంచి కారెక్టర్‌ను ఇచ్చినందుకు శేఖర్ గారికి థాంక్స్. ఫస్ట్ డే నుంచి నా మీద నమ్మకంతో ఉన్నారు. డైరెక్టర్‌గా మీకు అద్భుతమైన క్లారిటీ ఉంది. మీతో మళ్లీ పని చేసే అవకాశం ఇవ్వండి. అందరూ అద్భుతంగా నటించారు. సముద్రఖనితో పని చేయడం అద్భుతంగా ఉంది. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి లాంటి నిర్మాతలను నేను ఎక్కడా చూడలేదు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. బింబిసార, సీతారామంలో చిత్రపరిశ్రమ కళకళలాడుతోంది. చాలా సంతోషంగా ఉంది. విజువల్స్, మ్యూజిక్ అనేది ఈ సినిమాకు పెద్ద బలంగా మారుతాయి’ అని చెప్పుకొచ్చింది.