యాప్నగరం

రెహ్మాన్ మ్యూజిక్ కన్సర్ట్‌పై మంత్రి కేటీఆర్ ఎగ్జైట్‌మెంట్

మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అంటే ఇష్టం వుండని వాళ్లు వుంటారా ? 25 ఏళ్ల సంగీత ప్రస్థానంలో ఎందరో అభిమానుల...

TNN 26 Nov 2017, 5:46 pm
మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అంటే ఇష్టం వుండని వాళ్లు వుంటారా ? 25 ఏళ్ల సంగీత ప్రస్థానంలో ఎందరో అభిమానుల మనసు దోచుకున్న గొప్ప కంపోజర్ ఏఆర్ రెహ్మాన్. అందుకేనేమో.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా రెహ్మాన్ సంగీత కచేరిపై ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో వున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ లైవ్ కన్సర్ట్ వున్న నేపథ్యంలో ఆ క్షణం కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాను అని ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. తాను రెహ్మాన్‌కి ఎప్పటి నుంచో వీరాభిమానినే అయినప్పటికీ ఇప్పటివరకు అతడి లైవ్ కన్సర్ట్‌కి వెళ్లలేకపోయాను అని తన ట్వీట్‌లో స్పష్టంచేశారు.
Samayam Telugu ktrs excitement about ar rahmans live concert
రెహ్మాన్ మ్యూజిక్ కన్సర్ట్‌పై మంత్రి కేటీఆర్ ఎగ్జైట్‌మెంట్

Excited & looking forward to maestro @arrahman performing in Hyderabad today. Have been a huge fan of his for the longest time, but never been to his live concert😊Many things in Happening Hyderabad this week#MaestroInHyderabad#GES2017 #HyderabadMetroRail— KTR (@KTRTRS) November 26, 2017
అంతేకాకుండా హైదరాబాద్‌లో జరుగుతున్న రెహ్మాన్ లైవ్ కన్సర్ట్, జీఈఎస్ 2017, హైదరాబాద్ మెట్రో రైలు లాంటి లేటెస్ట్ అప్‌డేట్స్ గురించి అదే ట్వీట్‌లో మరో కామెంట్ చేసిన కేటీఆర్... ఆ కామెంట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని తనదైన స్టైల్లోనే ప్రమోట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.