యాప్నగరం

పవన్ కళ్యాణ్‌కి కొత్త అత్త?

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ వీరి కాంబినేషన్‌లో మూవీ అంటే హిట్ గ్యారంటీ అనే అభిప్రాయంలో ఉంటారు తెలుగు ప్రేక్షకులు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది, జల్సా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సాధించాయి. తాజాగా...

TNN 3 Nov 2016, 6:19 pm
పవన్ కళ్యాణ్‌కి కొత్త అత్త అంటే మరోపెళ్లికాని చేసుకున్నాడా అని అనుకునేరు. ఆయనకి అంత తీరికలేదులే కాని, కొత్త అత్త వచ్చింది మాత్రం నిజం. అయితే అది నిజ జీవితంలోకి కాదు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలోకి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ వీరి కాంబినేషన్‌లో మూవీ అంటే హిట్ గ్యారంటీ అనే అభిప్రాయంలో ఉంటారు తెలుగు ప్రేక్షకులు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది, జల్సా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సాధించాయి. అయితే ఈ కాంబినేషన్‌ ముచ్చటగా మూడో బ్లాక్ బస్టర్‌కి రెడీ అవుతుంది.
Samayam Telugu kushboo key role in pawankalyan trivikram srinivas movie
పవన్ కళ్యాణ్‌కి కొత్త అత్త?

ఇదిలావుంచితే త్రివిక్రమ్ సినిమాలన్నీ తన మాటల తూటాలతో కామెడీ టచ్ ఇస్తూ ఫ్యామిలీ సెంటిమెంట్ దగ్గరగా ఉంటాయి. పవన్ నెక్స్ట్ మూవీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్‌గానే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కథాపరంగా ఇందులో పవన్‌కి అత్త క్యారెక్టర్ కోసం చాలా పేర్లు బయటకు వచ్చినా చివరికి సీనియర్ నటి ఖుష్బూని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో అత్తగా నటించి మెప్పించిన ‘నదియా’ని రిపీట్ చేసే ఆలోచన ఉన్నప్పటికీ ప్రేక్షకులకు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉన్నందున త్రివిక్రమ్ ఈ కొత్తకాంబినేషన్‌ సెట్ చేశాడు. చాలారోజుల తరువాత మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న పవన్ కొత్త అత్తని చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.