యాప్నగరం

'డేట్‌ నైట్‌' విత్‌ బాలయ్య అంటున్న ఐటమ్‌గర్ల్!

‘రేసుగుర్రం’ సినిమాలో ‘బూచాడే బూచాడే.. బూమ్ బూమ్ బూమ్ చేత్తాడే’ అని బన్నీతో ఆడిపాడిన బ్యూటీ కైరా దత్‌.. ప్రస్తుతం బాలకృష్ణతో ‘పైసా వసూల్‌’లో నటిస్తోంది.

TNN 28 Jul 2017, 4:24 pm
‘రేసుగుర్రం’ సినిమాలో ‘బూచాడే బూచాడే.. బూమ్ బూమ్ బూమ్ చేత్తాడే’ అని బన్నీతో ఆడిపాడిన బ్యూటీ కైరా దత్‌.. ప్రస్తుతం బాలకృష్ణతో ‘పైసా వసూల్‌’లో నటిస్తోంది. శుక్రవారం విడుదలైన ‘పైసా వసూల్’ టీజర్‌లోనూ బాలయ్యతో చిందులేసింది. అయితే కైరా కేవలం ఐటమ్ సాంగ్‌కే పరిమితం కాలేదని, తన పాత్ర సినిమాలో ప్రాధాన్యం ఉందని దర్శకుడు పూరీ జగన్నాథ్ చెపుతున్నాడు. అందుకేనేమో ఈ బ్యూటీ బాలయ్య బాబుతో కలసి డిన్నర్లకు కూడా వెళ్తోంది.
Samayam Telugu kyra dutt tweets date night with balayya
'డేట్‌ నైట్‌' విత్‌ బాలయ్య అంటున్న ఐటమ్‌గర్ల్!


అసలు విషయానికొస్తే.. బాలకృష్ణతో కలసి డిన్నర్‌కి వెళ్లిన ఓ ఫొటోను కైరా తన ట్విట్టర్ ఖాతాలో పెట్టింది. ‘డేట్ నైట్ విత్ బాలయ్య గారు. సిసలైన జెంటల్‌మన్, ఆయన మనసు బంగారం.. అవధులు లేని ప్రేమ.. నిత్య గౌరవం’ అని ట్వీట్‌లో పేర్కొంది. ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేస్తూ తీసుకున్న ఫొటోతో ఈ ట్వీట్ చేసింది కైరా. మొత్తానికి టాలీవుడ్‌లో అవకాశాలు పెంచుకోవడానికి బాలయ్య బాబును బాగానే దువ్వుతున్నట్టుంది ఈ ఐటమ్ సుందరి.
Date night with Balakrishna Garu. A true gentleman & a man with a golden heart. Unconditional love & eternal respect. #NBK101 #PaisaVasool pic.twitter.com/RbzohSS0Ev — Kyra Dutt (@KyraDutt) July 27, 2017
కాగా, ఈరోజు విడుదలైన ‘పైసా వసూల్‌’ టీజర్‌‌కు మంచి స్పందన వస్తోంది. ‘స్టంపర్ 101’గా విడుదలచేసిన ఈ టీజర్‌ ఆరు గంటల్లోనే 6.5 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. శ్రియ, ముస్కాన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీత దర్శకుడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.