యాప్నగరం

Vignesh Shivan Birthday: ప్రియుడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో నయనతార సందడి.. ఫొటోలు

ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఈరోజు తన 34వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రేయసి, లేడీ సూపర్ స్టార్ నయనతార బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా జరిపారు.

Samayam Telugu 18 Sep 2019, 2:34 pm
లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితంలో ఈరోజు ఎంతో ప్రత్యేకమైనదట. ఎందుకంటే ఈరోజు తన ప్రియుడు, ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ 34వ పుట్టినరోజు. ఈ సందర్భంగా చెన్నైలోని ఓ కెఫేలో ఘనంగా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు నయన్. వేడుకలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, ధరణ్ కుమార్, యాంకర్ దివ్యదర్శిని, మేకప్ ఆర్టిస్ట్ ప్రకృతి అనంత్, మోడల్స్ సంయుత, ఆర్తి వెంకటేశ్, పూర్తి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Samayam Telugu photojoiner_photo.


READ ALSO: అనుష్కా.. సెట్స్‌లో ఆ ఆవలింతలేంటమ్మా? బ్యూటీ సమాధానమేంటో చూడండి..

బర్త్‌డే థీమ్ కలర్‌గా బ్లాక్ రంగుని ఎంచుకున్నారు. ఇందుకోసం అందరూ నల్ల దుస్తులు వేసుకుని ముస్తాబయ్యారు. నలుపు రంగు చీరల నయన్ చాలా అందంగా రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోను నయన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. విఘ్నేశ్, నయన్ దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి విహారయాత్రలకు వెళుతూ అక్కడి ఫొటోలను పోస్ట్ చేస్తుంటారు. ఓ ఆడియో ఫంక్షన్‌లో విఘ్నేశ్ తనకు కాబోయే భర్త అని నయన్ ప్రకటించేశారు కూడా. 2020లో వీరిద్దరూ పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చాలా కాలంగా కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2015లో వచ్చిన ‘రైడీ ధాన్’ సినిమా సెట్‌లో నయనతార, విఘ్నేశ్ శివన్ కలుసుకున్నారు.


ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. వర్క్ పరంగా ప్రస్తుతం నయనతార తమిళంలో ‘నెట్రికాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు విఘ్నేశ్ నిర్మాతగా వ్యవహరిస్తు్న్నారు. సినిమాలో నయన్ అంధురాలి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క నయన్ కథానాయికగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జోడీగా ‘దర్బార్’ సినిమాలో నటిస్తున్నారు. మరోపక్క ప్రముఖ తమిళ నటుడు విజయ్‌కు జోడీగా ‘బిగిల్’ సినిమతోనూ బిజీగా ఉన్నారు. అయితే సైరా, బిగిల్ సినిమాల కోసం నయన్ ఎంతో కాలంగా ఫాలో అవుతూ వస్తున్న రూల్‌ను బ్రేక్ చేయనున్నారట. నయన్ సినిమాల్లో నటిస్తారే తప్ప ఎలాంటి ప్రచార కార్యక్రమాలకు హాజరుకారు. కానీ సైరా, బిగిల్ సినిమాల కోసం ఆమె ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని నిర్ణయించుకున్నారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.