యాప్నగరం

Vignesh Shivan Birthday : భర్తకు నయనతార సర్‌ప్రైజ్‌.. ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసిన విఘ్నేష్‌

Burj Khalifa : లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార (Nayanthara), డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ (Vignesh Shivan) పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారైన సంగ‌తి తెలిసిందే. కొత్త జంట వారి జీవితంలోని ప్ర‌తి మూమెంట్‌ను గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. తీరిక ఉన్న స‌మ‌యాల్లో విహార యాత్ర‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో విఘ్నేష్ శివ‌న్ పుట్టిన‌రోజు ఆదివారం రోజున సెల‌బ్రేట్ చేయాల్సి వ‌చ్చింది. పెళ్లి త‌ర్వాత భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ సెల‌బ్రేట్ చేసుకుంటోన్న తొలి పుట్టిన‌రోజు ..

Authored byతుమ్మల మోహన్ | Samayam Telugu 18 Sep 2022, 11:50 am
ఈ ఏడాది లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార (Nayanthara), డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ (Vignesh Shivan) పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారైన సంగ‌తి తెలిసిందే. కొత్త జంట వారి జీవితంలోని ప్ర‌తి మూమెంట్‌ను గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. తీరిక ఉన్న స‌మ‌యాల్లో విహార యాత్ర‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో విఘ్నేష్ శివ‌న్ పుట్టిన‌రోజు ఆదివారం రోజున సెల‌బ్రేట్ చేయాల్సి వ‌చ్చింది. పెళ్లి త‌ర్వాత భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ సెల‌బ్రేట్ చేసుకుంటోన్న తొలి పుట్టిన‌రోజు (Vignesh Shivan Birthday)కావ‌టంతో న‌య‌న‌తార త‌గ్గేదే లే అని చాలా గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసింది. అది కూడా ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది.
Samayam Telugu Vignesh Shivan Birthday
విఘ్నేష్ శివన్ బర్త్ డే


ప్ర‌పంచంలోనే ఎత్తైన భ‌వ‌నంగా పేరున్న బుర్జ్ ఖ‌లీఫా (Burj Khalifa) ముందు భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ బ‌ర్త్ డేను న‌య‌న‌తార గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసింది. ఆమెతో పాటు విఘ్నేష్ శివ‌న్ కుటుంబ స‌భ్యులు కూడా ఆ వేడుక‌ల్లో పాల్గొన్నారు. భార్య ఇచ్చిన స‌ర్‌ప్రైజ్ చూసి విఘ్నేష్ శివ‌న్ ఎంతో హ్యాపీగా ఫీల‌య్యారు. త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మంలో ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశారు. ‘‘నా భార్య న‌య‌న‌తార అద్భుత‌మైన స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. త‌ను నా బంగారం. నన్నెంతో ప్రేమించే వ్య‌క్తుల మ‌ధ్య పుట్టిన‌రోజు వేడుక‌లను బుర్జ్ ఖ‌లీఫా ద‌గ్గ‌ర సెల‌బ్రేట్ చేసుకోవ‌టం క‌ల‌లాగా ఉంది. దీని కంటే ప్ర‌త్యేక‌త‌ను నేను ఊహించ‌లేను. ఇలాంటి అద్భుత‌మైన జీవితాన్ని, మ‌ర‌చిపోలేని క్ష‌ణాల‌ను నాకు ఇచ్చిన ఆ భ‌గ‌వంతుడికి ఎప్ప‌టికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను’’ అన్నారు.

పెళ్లి త‌ర్వాత కూడా న‌య‌న‌తార యాక్టింగ్ మానేస్తార‌ని చాలా వార్త‌లే వినిపించాయి. కానీ ఆ వార్త‌ల‌న్నీ అవాస్త‌వాల‌నీ తేలిపోయాయి. ఆమె షారూక్ ఖాన్ సినిమాను పూర్తి చేయ‌ట‌మే కాదు.. త‌న 75వ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చేసింది. నీలేష్ కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నారు.

View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial)
రచయిత గురించి
తుమ్మల మోహన్
మోహ‌న్ కుమార్ తుమ్మ‌ల స‌మ‌యం తెలుగులో డిజిట‌ల్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఇక్కడ సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్, వార్తలను రాస్తుంటారు. మోహ‌న్ కుమార్‌కి సినీ జ‌ర్న‌లిజంలో 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. గ‌తంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లో సినీ జ‌ర్న‌లిస్టుగా వ‌ర్క్ చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.