యాప్నగరం

రీమిక్స్ పేరుతో క్లాసిక్స్‌ను చెడగొట్టొద్దు: లత

పాత సినిమా పాటలను రీమిక్స్ చేసి వైవిధ్యంగా ప్రెజెంట్ చేయడం ఇటీవల కొత్త ట్రెండ్‌గా మారింది. నేటితరం రీమిక్స్ క్రేజ్‌లో ఉర్రూతలూగుతోంది. కానీ, ఆ పాత మధురాలను రీమిక్స్ చేయడం అలనాటి నటులు, గాయకులకు అస్సలు నచ్చడం లేదు.

TNN 26 Oct 2017, 4:10 pm
పాత సినిమా పాటలను రీమిక్స్ చేసి వైవిధ్యంగా ప్రెజెంట్ చేయడం.. ప్రస్తుతం కొత్త ట్రెండ్‌గా మారింది. నేటితరం రీమిక్స్ క్రేజ్‌లో ఉర్రూతలూగుతోంది. కానీ, ఆ పాత మధురాలను రీమిక్స్ చేయడం అలనాటి నటులు, గాయకులకు అస్సలు నచ్చడం లేదు. రీమిక్స్ పేరుతో భావాన్ని, అర్థాన్ని ఖూనీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. ఇటీవల యశ్‌రాజ్ ఫిలింస్.. ఒకప్పటి హిట్ సాంగ్ ‘మై యార్ మననా..’ పాటను రీమిక్స్ చేసి, దానికి బాలీవుడ్ నటి వాణి కపూర్‌తో స్టెప్స్ వేయించి తీసిన రీమిక్స్ సాంగ్ వీడియోను విడుదల చేసింది. ఈ పాట యూత్‌కి కూడా తెగ నచ్చేసింది. అయితే లతా మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Samayam Telugu lata mangeshkar opposes the idea of remix songs
రీమిక్స్ పేరుతో క్లాసిక్స్‌ను చెడగొట్టొద్దు: లత


‘రీమిక్స్ చేయడం అంటే.. ఒరిజినల్ పాటను అగౌరవపరిచనట్లే.. అందుకే అలాంటి పాటలను నేను వినను. రీమిక్స్ పేరుతో అలనాటి క్లాసిక్స్‌ను చెడగొట్టొద్దు. ఇప్పటికే లక్ష్మీకాంత్ ప్యారేలాల్, మదన్ లాంటి దిగ్గజాల పాటలకు బీట్స్, మాటలు కల్పించి అపవిత్రం చేశారు. అలా చేయడం తాజ్ మహల్‌కు కొత్త గదులు చేర్చడం లాంటిదే’ అని గాన కోకిల వ్యాఖ్యానించారు.

ఒరిజినల్ పాటను క్రియేట్ చేయలేనప్పుడు మరొకరి పాటను రీమిక్స్ చేయడం సరికాదని లతా మంగేష్కర్ తేల్చి చెప్పారు. ‘మై యార్ మననా..’ పాటను అప్పట్లో లత ‘దాగ్’ సినిమా కోసం పాడారు. వీనులకి ఇంపైన ఆపాత మధురాలను కూనీ చేయకుండా ఉండటమే మంచిది కదా..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.